సైకో కిల్లర్.. 93 మంది తో శృంగారం..ఆపై హత్య! హత్యల్లో ఇదో రికార్డట!

సైకో కిల్లర్.. 93 మంది తో శృంగారం..ఆపై హత్య! హత్యల్లో ఇదో రికార్డట!
x
Highlights

ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 93 మందితో శృంగారంలో పాల్గొని వాళ్ళందరి ప్రాణాలు తీశాడో వ్యక్తి. ప్రస్తుతం అతను యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు.

ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 93 మందితో శృంగారంలో పాల్గొని వాళ్ళందరి ప్రాణాలు తీశాడో వ్యక్తి. ప్రస్తుతం అతను యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్ కు చెందిన సామ్యూల్‌ లిటల్‌కు ఇప్పుడు 79 ఏళ్లు. ఫేమస్ బాక్సర్‌.. దృఢమైన శరీరం అందమైన ముఖ కవళికలు ఉన్నాయి. దీంతో తనకు తాను గట్టి శృంగార పురుషుడని చెప్పుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే ఏకంగా 93 మందితో శృంగారంలో పాల్గొన్నాడు. గందరగోళంగా ఉండే అయన ముఖంలో నవ్వు ఛాయలు చిన్నప్పుడే దూరమయ్యాయి. దానికి కారణం ఆయన ప్రవర్తనే.. కేవలం శృంగార జీవితాన్ని గుర్తు చేసినప్పుడు మాత్రమే ఆయన ముఖంలో నవ్వు చూడవచ్చు.

శృంగారమే జీవితంగా బ్రతికిన ఆయన 93 మందిని హత్య చేశాడు. వారంతా ఆడవాళ్లే. వారిలో ఎక్కువ మంది వ్యభిచారిణులు, మాదక ద్రవ్యాలకు బానిసలైన ఆడవాళ్లే ఉన్నారు. వారందరితో శంగార జీవితం గడిపన తర్వాతే సామ్యూల్‌ వారిని హత్య చేసినట్టు అమెరికా పోలీసులు నిర్ధారించారు. ఫేమస్ బాక్సర్‌ అయినా ఉండటానికి ఇల్లు, వాకిలి లేదు. బ్రతకడం కోసం చిల్లర దొంగతనాలు చేసేవాడు. ఆ క్రమంలోనే శృంగార జీవితాన్ని నెరపుతున్న ఆడవారిని వేధించి డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసేవాడు.

అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్, మియామీలలో. దక్షిణ కరోలినా, ఓహాయో, టెక్సాస్‌ సహా 19 రాష్ట్రాల్లో ఆయన ఆడవాళ్ళతో శృంగారంలో పాల్గొని హత్యలు చేశాడు. ఆడవాళ్లను నగ్నంగా చేసి శృంగారం అనంతరం వారిని హత్య చేసి చెత్త కుండీల్లో, మురికి కాల్వల్లో పడేసే అలవాటు ఉంది. కొంత మంది పేర్లు తెలుసుకోకుండానే వారితో శృంగారంలో పాల్గొని హత్య చేసేవాడట. అయితే కొత్త వారితో సెక్స్‌ నెరపడానికి పాత ప్రియురాళ్లు అడ్డు వస్తారనే కారణంతో వరుస పెట్టి వారందర్ని హత్యలు చేస్తూ వచ్చాడట. అమెరికా చరిత్రలోనే ఎక్కువ మందిని అంతమొందించిన ఈ సీరియల్‌ కిల్లర్‌ చేసిన అకృత్యాలను మరోసారి విచారిస్తున్నారు.

ఇంతవరకు ఈ కిరాతక రికార్డు లారీ డ్రైవర్‌ గేరి రిడ్జ్‌వే పేరిట ఉంది. అతను 1980 నుంచి 1990 సమయంలో మొత్తం 49 హత్యలు చేశాడు. ఆ తర్వాత కాలంలో మరో 20 మందిని హత్య చేసినట్లు పొలిసు విచారణలో ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును సామ్యూల్‌ లిటిల్‌ అధిగమించాడని ఎఫ్బిఐ పోలీసులు వెల్లడించారు. సామ్యూల్‌ లిటిల్‌ కూడా 50 మందిని హత్యా చేసినట్టు ఒప్పుకోవడమే కాక వారందరి బొమ్మలు కూడా గీసి చూపించాడని విచారణలో చెప్పాడని పొలిసు అధికారులు దృవీకరించారు. 43 హత్యల కేసులను ఆయన అంగీకరించాల్సి ఉంది. వారి పేర్లు లేదా కనీసం వారి ముఖాలు కూడా ఆయనకు గుర్తు లేకపోవడమే ఆయన నేరం అంగీకరించక పోవడానికి కారణమని తెలిపారు.

1980 దశకంలో జరిగిన ముగ్గురు మహిళల హత్య కేసుల్లో సామ్యూల్‌ లిటిల్‌కు 2014లో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఆయన ప్రస్తుతం లాస్‌ ఏంజెలిస్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మిగిలిన 43 మంది హత్యల గురించి ఆయన నుంచి కూపీ లాగేందుకు ఎంత ప్రయత్నించినా సమాచారం బయటకి రావడంలేదు. పలుమార్లు అమెరికా పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. 1994లో టెక్సాస్లో డెనైస్‌ బ్రదర్స్‌ అనే 38 ఏళ్ల వేశ్య హత్య జరిగింది. అది సామ్యూల్‌ లిటిల్‌ చేశాడని అనుమానం ఉన్నా ఆధారాలు లభించక పోవడంతో రుజువు చేయలేక పోయారు పోలీసులు. కరుడుగట్టిన నేరస్థుల నుంచి కూడా కూపీ లాగే అమెరికా పోలీసు అధికారి జేమ్స్‌ హాలండ్‌ కూడా ఆ 43 మంది హత్యా ఆధారాలు రాబట్టలేకపోయారు.

అయితే పలుమార్లు విచారించడం ద్వారా ఒక్కొక్క కేసు వివరాలను రాబట్టగలుగుతున్నారు. మరోవైపు 'సెక్స్‌ ప్రిడేటర్‌' అని తనపై అనవసరంగా ముద్ర వేస్తున్నారని, తాను కేవలం హంతకుడిని మాత్రమేనని.. రేపిస్టును కాదని.. ఇష్ట పూర్వకంగానే అమ్మాయిలు తనతో శృంగారంలో పాల్గొన్నారని సామ్యూల్‌ వివరించాడు. చాలా ఏళ్లుగా సామ్యూల్‌ను ఎప్‌బీఐ అధికారులు ఇంటరాగేట్‌ చేస్తున్నారు. ఇటీవల ఇతనిపై విచారణకు సమ్బన్ధంచి కొన్ని వీడియోలను కూడా విడుదల చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories