ర‌ష్యా అద్యక్షుడి అధికార ప్ర‌తినిధికి క‌రోనా

ర‌ష్యా అద్యక్షుడి అధికార ప్ర‌తినిధికి క‌రోనా
x
Highlights

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే వెల్లడించారు. మంగళవారం పెస్కోవ్ ఇంటర్‌ఫాక్స్ అనే వార్తా సంస్థతో మాట్లాడుతూ.. "అవును, నేను అనారోగ్యం భారిన పడ్డాను. ప్రస్తుతం నేను చికిత్స పొందుతున్నాను." అని పేర్కొన్నారు. 52 ఏళ్ల పెస్కోవ్ 2008 నుండి పుతిన్ కు అధికార ప్రతినిధిగా ఉన్నారు.. పెమ్కోవ్ చివరిసారిగా ఏప్రిల్ 30 న బహిరంగంగా "వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన సమావేశంలో" కనిపించారని క్రెమ్లిన్ పూల్ నుండి విలేకరులు ట్విట్టర్‌లో తెలిపారు.

ఇటీవలి వారాల్లో పుతిన్ తన సమావేశాలన్నింటినీ టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నందున, ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారా? లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. కాగా క‌రోనా వ్యాప్తిని స‌మ‌ర్ధ‌వంతంగా అడ్డుకోవ‌డంలో ర‌ష్యా విజ‌యవంత‌మైందని అద్యక్షుడు పుతిన్ ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజే ఆయ‌న అధికార ప్ర‌తినిధికి వైర‌స్ సోక‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే రష్యా ప్రధాని మిఖైల్ మిషుస్టిం కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories