Zelenskyy: 117 డ్రోన్లు.. 18 నెలల ప్లానింగ్‌.. ఆపరేషన్‌ స్పైడర్‌వెబ్‌తో తొడగొట్టిన జెలెన్‌స్కీ

russia ukraine war after shaking big attacks zelensky roared challenges putin telugu news
x

Zelenskyy: 117 డ్రోన్లు.. 18 నెలల ప్లానింగ్‌.. ఆపరేషన్‌ స్పైడర్‌వెబ్‌తో తొడగొట్టిన జెలెన్‌స్కీ

Highlights

Zelenskyy: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఉక్రెయిన్...

Zelenskyy: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ చేపట్టిన ఈ దాడుల్లో 40కి పైగా రష్యా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ధ్వంసం అయ్యాయి. ఉక్రెయిన్ రష్యా మధ్య ఇస్తాంబుల్ లో సోమవారం శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా కీలక మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్ ఇంత భారీ స్థాయిలో దాడులు జరపడం కూడా ఇదే మొదటిసారి. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా స్పందించారు. దీన్ని అద్భుతమైన ఆపరేషన్ గా అభివర్ణించారు.

తమ సాయుధ దళాలు అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించాయని తెలిపారు. ఈ దాడికి స్పైడర్ వెబ్ గా పేరు పెట్టినట్లు తెలిపారు. మూడేళ్లకు పైబడిన యుద్ధంలో మా అత్యంత సుదూర ఆపరేషన్ ద్వారా అద్బుతమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ దాడి ప్రణాళికకు 18నెలల సమయం పట్టినట్లు తెలిపారు. మొత్తం 117 డ్రోన్లను ఉపయోగించినట్లు ఆయన వెల్లడించార.

ఇప్పుడే మా స్పెషల్ ఫోర్స్ అధిపతి వాసిల్ మలియుక్ అద్భుతమైన ఆపరేషన్ గురించి తెలిపారు. శత్రు భూభాగంలోని సైనిక లక్ష్యాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాము. ప్రత్యేకంగా ఉక్రెయిన్ పై దాడి చేసేందుకు ఉపయోగించే పరికరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాము. మా సాయుధ దళాలు అద్భుతమైన ఆపరేషన్ను నిర్వహించాయి. ఈ దాడిలో రష్యా గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. ఆ దేశానికి ఇలా జరగాల్సిందే. ఆపరేషన్ ప్రణాళిక కోసం ఏడాదిన్నర సమయం పట్టింది మాకు. ప్లాన్ చేసి దాని ప్రకారంగానే రష్యాపై ఈ ఆపరేషన్ను అమలు చేశాము. ఇది పూర్తిగా ప్రత్యేకమైన ఆపరేషన్ అని నేను చెబుతాను.

ఈ దాడిలో 117 డ్రోన్లను వినియోగించాము. వైమానిక స్థావరాల్లోని 34 శాతం వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహన నౌకలను ధ్వంసం చేశాము. మా దాడిలో రష్యాకు భారీగా నష్టం వాటిల్లింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఈ ఆపరేషన్ గురించి బహిరంగంగా చెప్పడం. మేం ఆపరేషన్ చేపట్టిన ఆఫీస్, రష్యన్ భూభాగంలోని ఎఫ్ఎస్ బీ కార్యాలయానికి పక్కనే ఉంది. ఇక ఈ దాడికి సాయం చేసినవారిని ఆపరేషన్ ముందు రష్యా నుంచి తీసుకువచ్చాం. వారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. ఏడాదిన్నర శ్రమ ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. మేం ఈదాడులను కొనసాగిస్తామని జెలెన్ స్కీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories