ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు.. రంగంలోకి 16వేల మంది విదేశీ ఫైటర్లు...

Russia Increased Attacks on Ukraine and Foreign Fighters are Landing in Ukraine for War | Live News
x

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు.. రంగంలోకి 16వేల మంది విదేశీ ఫైటర్లు...

Highlights

Russia - Ukraine War: కీవ్ ముట్టడికే ప్రాధాన్యత ఇస్తున్న రష్యా బలగాలు...

Russia - Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు ఎంత నచ్చజెప్పినా నెమ్మదించని పుతిన్ సేనలు.. ఉక్రెయిన్ లోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ప్రధానంగా ఆస్పత్రులు, వైమానిక స్థావరాలపై విరుచుపడుతున్నాయి. దీంతో భారీ విధ్వంసాలే చోటు చేసుకోగా.. ఈ ఘటనల్లో పిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు.

తాము అనుకున్నది, అనుకున్నట్లుగానే రష్యా సైనికులు చేస్తూనే ఉన్నారు. ప్లాన్ ప్రకారమే దాడులకు పాల్పడుతున్నారు. ఇన్నాళ్లు రాజధాని శివారులో ఉన్న సైతాన్లు.. మెల్లగా కీవ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే కీవ్ పై దాడి చేయడం కంటే దాని ముట్టడికే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి అవరోధాల కారణంగా రష్యా తన వ్యూహాన్ని మార్చుకుని ఉండొచ్చని బ్రిటన్ అనుమానిస్తోంది.

ఎంతకూ చేజిక్కని కీవ్ ను కొల్లగొట్టేందుకు పుతిన్ సరికొత్త వ్యూహానికి తెరతీశారు. విదేశాలకు చెందిన 16వేల మంది ఫైటర్లను ఉక్రెయిన్ లో దించేందుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. వీరంతా మధ్య ఆసియాకు చెందినవారని, వీరిలో చాలామంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై పోరాడినవారేనని రష్యా రక్షణ మంత్రి వెల్లడించారు. నిజానికి వీరంతా రష్యా అనుకూల సిరియా నుంచి రానున్నట్లు తెలుస్తోంది.

ఐరోపాలోనే అతిపెద్ద అణు రియాక్టర్ జాపోరిజియా భవనంపై దాడిచేసిన పుతిన్ బలగాలు.. తాజాగా ఖర్కివ్ లోని అణు పరిశోధన కేంద్రంపై విరుచుకుపడ్డాయి. దీంతో ఈ యూనిట్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories