బహిరంగంగా కనిపించింది నకిలీ కిమ్ అట..

బహిరంగంగా కనిపించింది నకిలీ కిమ్ అట..
x
kim jung un
Highlights

కిమ్ జంగ్ ఉన్.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరంటే తెలియని వారుండరు.. తాత, తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దేశాధ్యక్షుడయ్యారు.

కిమ్ జంగ్ ఉన్.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరంటే తెలియని వారుండరు.. తాత, తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దేశాధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం ఎక్కడైనా నియంతృత్వ పాలన సాగుతోందంటే అది ఉత్తరకొరియాలోనే అని చెప్పవచ్చు. ఉత్తరకొరియా అధ్యక్షుడైన కిమ్.. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారని ఆ దేశమే చెబుతోంది. అయితే ఇటీవల కోలుకున్నారని కూడా చెబుతోంది. అయితే ప్రపంచదేశాలు మాత్రం దీనిని నమ్మడంలేదు.

దాదాపు 20 రోజులుగా కనిపించకుండా పోయిన కిమ్, గత వారం చివరిలో ఓ ఫర్టిలైజర్ కంపెనీ ప్రారంభోత్సవంలో కనిపించినట్టు కొన్ని ఫోటోలు దర్శనమిచ్చాయి.. అయితే ఈ కార్యక్రమానికి వచ్చింది కిమ్ కాదని, అతని డూప్ అని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలో కిమ్ జాంగ్ పాత ఫోటోలను, తాజా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, రెండిండికి మధ్య తేడాలను చూపిస్తున్నారు. బ్రిటన్ మాజీ ప్రజా ప్రతినిధి లూయిస్ మెన్స్, తాను గతంలో తీసిన కిమ్ చిత్రాలను పోస్ట్ చేస్తూ, పాత కిమ్ పళ్ల వరుసకు, కొత్త కిమ్ పళ్ల వరుసకూ తేడా కనిపిస్తోందని చెప్పారు, అంతేకాదు ఆయన హెయిర్ స్టయిల్ కూడా మారిందని సోషల్ మీడియాలో వస్తున్నాయి. దాంతో మరోసారి కిమ్ విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది

కాగా, గతంలో పలు దేశాధినేతలు... ప్రాణరక్షణ కోసం ముఖ్యంగా హిట్లర్, సద్దామ్ హుస్సేన్ వంటి వారు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు తమ డూప్ లను పంపేవారన్న సంగతి తెలిసిందే. వారిలాగే కిమ్ కూడా ఇలాగే చేసి ఉంటారని.. ఇందుకోసం ఆయన ఐదుగురిని తయారు చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories