ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి, 11 మంది గాయాలు

Road Accident In Australia
x

ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి, 11 మంది గాయాలు

Highlights

Road Accident: పెళ్లికి వచ్చిన అతిథులతో వెళ్తూ కాలువలో పడిన బస్సు

Road Accident: ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హంటర్ వ్యాలీ ప్రాంతంలో పెళ్లికి వచ్చిన అతిథులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు.11 మంది గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రేటాలోని హంటర్ ఎక్స్ ప్రెస్ వే ఆఫ్-ర్యాంప్ సమీపంలో వైన్ కంట్రీ డ్రైవ్ లో ప్రమాదం జరిగిందని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవలు అందించారు. గాయపడిన 11 మందిని హెలికాప్టర్, రోడ్డు మార్గంలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories