మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? మసీదుపై ఎర్ర జెండా అందుకేనా?

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? మసీదుపై ఎర్ర జెండా అందుకేనా?
x
Highlights

మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడు విపరీతంగా వినిపిస్తున్న మాట. ఇరాన్ నిఘా విభాగం మేజర్ జనరల్ ఖాసీం సులైమనీ ని ఇటీవల అమెరికా హతమార్చిన విషయం విదితమే. అప్పటి...

మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడు విపరీతంగా వినిపిస్తున్న మాట. ఇరాన్ నిఘా విభాగం మేజర్ జనరల్ ఖాసీం సులైమనీ ని ఇటీవల అమెరికా హతమార్చిన విషయం విదితమే. అప్పటి నుంచి ఇరాన్ దేశమంతా అమెరికా వైఖరిపై ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ నేపధ్యంలో ఇరాన్-అమెరికాల మధ్య విపరీతంగా వైరుధ్యాలు పెరిగిపోయాయి. ఈ చిచ్చు ఇప్పుడు ప్రపచం అంతా పాకిపోయింది. ఇరాన్ ఆమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం అవుతోందన్న వార్తలూ వస్తున్నాయి. అదే జరిగితే కచ్చితంగా ఆ యుద్ధం ప్రపంచ యుద్ధంగా పరిణమిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడు దానిని బలపరిచే సంఘటన ఇరాన్ లో చోటు చేసుకుంది.

ఇరాన్లోని జంకారా మసీదు డోమ్ పై ఎర్రజెండా ఎగరేశారు. ఇది యుద్ధం రాబోతోంది అందానికి సూచికగా చెబుతారు. అమెరికా మీద ప్రతీకారం తీరుచుకునేందుకు ఈ జెండా ఎగరవేసినట్టు భావిస్తున్నారు. అప్పుడెప్పుడో క్రీ.శ.680 లో ఇలా మసీదు పై ఎర్రజెండా ఎగురవేశారని చరిత్ర చెబుతోంది. అప్పట్లో కర్బలా యుద్ధం తరువాత ఈ ఎర్ర జెండా ఎగురవేశారట. ఆ యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనవడైన ఇమామ్ హుస్సేన్ హతమయ్యాడని చెబుతారు. షియా సాంప్రదాయం ప్రకారం పగ తీర్చుకున్నాకే ఆ జెండాను కిందకి దించుతారు.

ఇక అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆ దేశానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము ఇరాన్ కు అత్యంత కీలకమైన 52 ప్రాంతాలను టార్గెట్ చేసినట్టు చెబుతూ అయన త్వీట్ చేశారు.

ప్రస్తుతం ఇరాన్ మసీద్ పై ఎర్రజెండా ఎగురవేయటం, ట్రాంప్ హెచ్చరికలు జరీ చేయడం వంటి పరిస్థితులు గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు రేపాయి. ఈ ఉద్రిక్తతలు మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తాయనే సందేహాలూ ఉన్నాయి. అవి ఎంత వరకూ నిజమవుతాయో కానీ, ఈ లోపు ఈ వ్యవహారంపై ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, ఈ ఉద్రిక్తతలు ఇప్పట్లో సర్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories