Euorpe Wildfires: యూరప్ దేశాల్లో కార్చిచ్చు బీభత్సం

Raging Wildfires in Europe Countries
x

యూరప్ దేశాల్లో కార్చిచ్చు బీభత్సం (ఫైల్ ఫోటో)

Highlights

* గ్రీస్‌లో అనేక ప్రాంతాలను చుట్టేసిన కార్చిచ్చు * 10 రోజుల్లో 56,655 హెక్టార్ల మేర అగ్నిజ్వాలల వ్యాప్తి

Euorpe Wildfires: మొన్నటి వరకూ వరదలతో అతలాకుతలమైన యూరప్ దేశాల్లో ఇప్పుడు కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. గ్రీస్‌లో అనేక ప్రాంతాలను చుట్టుముట్టిన దావానలం, మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఏథెన్స్ తదితర ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గత కొన్నివారాలుగా గ్రీస్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క గ్రీస్ లోనే గత 10 రోజుల్లో 56వేల 655 హెక్టార్ల మేర అగ్నిజ్వాలలు వ్యాపించాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల నేపథ్యంలో కార్చిచ్చు మరికొంత కాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం గ్రీస్ లో 14వందల 50 మంది అగ్నిమాపక సిబ్బంది విమానాల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories