ప్రిన్సెస్ డయానా వ్యక్తిగత లేఖల వేలం

Princess Dianas Personal Letters Auction
x

ప్రిన్సెస్ డయానా వ్యక్తిగత లేఖల వేలం

Highlights

డయానా వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఘటనలు కూడా ఈ లేఖల్లో ఉన్నాయి. 1982 నాటి రాయల్ లెటర్ హెడ్ పై చేతిరాతతో రాసిన నోట్స్ లో ప్రిన్స్ చార్లెస్ తో తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించారు.

ప్రిన్సెస్ డయానా తన మాజీ హౌస్ కీపర్ కు రాసిన పలు లేఖలను ఈ నెల 27న వేలం వేస్తారు. 1981 లో ప్రిన్స్ చార్లెస్ ను డయానా వివాహం చేసుకున్నారు. వేల్స్ యువరాణి , ఆమె మాజీ హౌస్ కీపర్ మౌడ్ పెండ్రే మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. అంతేకాదు 1981-1985 లో మార్చుకున్న 14 క్రిస్మస్, న్యూఇయర్ కార్డులను కూడా వేలం వేస్తారని న్యూయార్క్ పోస్ట్ కథనం తెలిపింది.

డయానా వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఘటనలు కూడా ఈ లేఖల్లో ఉన్నాయి. 1982 నాటి రాయల్ లెటర్ హెడ్ పై చేతిరాతతో రాసిన నోట్స్ లో ప్రిన్స్ చార్లెస్ తో తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించారు.

విలియం జన్మించిన కొద్దికాలానికి తనను తాను చాలా అదృష్టవంతమైన తల్లిగా అభివర్ణించుకున్నారు. విలియమ్ ద్వారా తాము అమితమైన ఆనందాన్ని పొందిన విషయాన్ని చెప్పారు.1982 సెప్టెంబర్ లో బాల్మోరల్ కాజిల్ లెటర్ హెడ్ పై ప్రిన్స్ విలియంకు బహుమతి ఇచ్చినందుకు ఉద్యోగులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ నోట్ ను ఆమె ఉద్యోగులకు పంపారు. మీరు పంపిన గిఫ్ట్ తో చాలా సంతోషంగా ఉన్నామన్నారు. 1983 జూలై 13న రెండు పేజీల లేఖలో టేకాఫ్ అయిన హెలికాప్టర్ గురించి రాశారు.

ప్రిన్సెస్ డయానా స్వచ్చంద సేవా, వ్యక్తిగత జీవితంలో ప్రపంచంలో ప్రసిద్ది పొందారు. ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీలకు డయానా తల్లి. 1996 లో కింగ్ చార్లెస్ కు డయానా విడాకులిచ్చారు. 1997లో పారిస్ లో జరిగిన కారు ప్రమాదంలో డయానా మరణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories