బ్రిటన్ రాణి మనవరాలు వివాహం వాయిదా

బ్రిటన్ రాణి మనవరాలు వివాహం వాయిదా
x
Princess Beatrice, Edoardo
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్రమణ కారణంగా ఇప్పటి వరకు 21 లక్షల మందికి పైగా వ్యాధి భారిన పడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సంక్రమణ కారణంగా ఇప్పటి వరకు 21 లక్షల మందికి పైగా వ్యాధి భారిన పడ్డారు.. ఇందులో 1 లక్ష 47 వేల 10 మరణాలు సంభవించాయి. అంతేకాదు ఐదు లక్షలకు పైగా రోగులు కోలుకున్నారు. కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితమైనది అమెరికా, ఇక్కడ 6 లక్షల 78 వేల 210 పాజిటివ్ కేసులు కనుగొనబడ్డాయి.. 35 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. యూకే లో కూడా అత్యధిక కేసులు, మరణాలు సంభవించాయి.. ఈ క్రమంలో కరోనాను దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ తన మనవరాలు బీట్రైస్ వివాహాన్ని వాయిదా వేశారు.

బీట్రైస్.. ఇడార్డోను వివాహం చేసుకోబోతున్నారు. అంతేకాదు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరగబోయే రిసెప్షన్‌ను కూడా రద్దు చేశారు. పెళ్లి వేదికను మార్చాలనే ఉద్దేశ్యం కాదని.. పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీట్రైస్, ఇడార్డో ప్రతినిధి వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories