అమెరికాలో పర్యటిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

President of Ukraine Zelensky Visit to America
x

అమెరికాలో పర్యటిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ 

Highlights

Zelenskyy: అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో జెలెన్ స్కీ కీలక ప్రసంగం

Zelenskyy: ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత తొలిసారిగా ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా యూఎస్ కాంగ్రెస్‌ ఉభయ సభల్లో జెలెన్ స్కీ కీలక ప్రసంగం చేశారు. రష్యాను ఢీకొట్టేందుకు తమ దేశ సైనికులు వీరోచిత పోరాటం చేస్తున్నారని..అలాంటి పరిస్థితుల్లో తమకు అండగా అమెరికా నిలబడడం నిజంగా గర్వించదగ్గ విషయమన్నారు. ప్రపంచ శాంతి కోసం తాము రష్యాతో పోరాడుతున్నామని ఈ యుద్ధం వెంటనే ఆగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో తమ భూభాగాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని జెలెన్ స్కీ తేల్చిచెప్పారు. మరోవైపు అమెరికాలో పర్యటిస్తున్న జెలెన్ స్కీ అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయి కీలక చర్చలు జరుపుతున్నారు.

ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి భారీ సహాయ ప్యాకేజీని ప్రకటించింది. 180 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం అందజేయనుంది. ఇందులో ఒక బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, 800 మిలియన్ డాలర్ల నిధులున్నాయి. పేట్రియాట్ క్షిపణులు, ఉక్రెయిన్ యుద్ధ విమానాల కోసం అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్ బాంబులను తొలిసారిగా ఉక్రెయిన్‌కు ఇస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు ముమ్మరం చేసిన నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాలను అందించాలని అమెరికా నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories