చర్చిలో తొక్కిసలాట.. 20 మంది మృతి

చర్చిలో తొక్కిసలాట.. 20 మంది మృతి
x
Highlights

టాంజానియాలో ఘోరం జరిగింది. డోడోమా, టాంజానియా - ఉత్తర టాంజానియా నగరమైన మోషిలో జరిగిన చర్చి సమావేశంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు...

టాంజానియాలో ఘోరం జరిగింది. డోడోమా, టాంజానియా - ఉత్తర టాంజానియా నగరమైన మోషిలో జరిగిన చర్చి సమావేశంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు అలాగే డజను మంది గాయపడ్డారు అని ప్రభుత్వం ఆదివారం తెలిపింది. టాంజానియాలో ప్రముఖ పాస్టర్‌ బోనిఫెస్‌ వాంపోసా ఆధ్వర్యంలో శనివారం రాత్రి సమావేశం జరిగింది. అందులో పాస్టర్‌ బోనిఫెస్‌ వాంపోసా ప్రార్థించిన నూనెను వేదిక ఎదుట పోశారు. భక్తులు ముందుకొచ్చి నూనెను తాకాలని కోరాడు. ఆ నూనెను తాకితే రోగాల నుంచి విముక్తి లభిస్తుందని భావించిన క్రీస్తు భక్తులు ఒక్కసారిగా మందగా ముందుకు వచ్చారు. దాంతో తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఊపిరాడక అక్కడికక్కడే 20 మంది మృతి చెందారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఘటనకు కారణమైన పాస్టర్‌తోపాటు మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్గత మంత్రి జార్జ్ సింబాచావేనే మాట్లాడుతూ వాంపోసా అరెస్టు చేశామని అన్నారు. అయితే అతనిపై ఉన్న అభియోగాలు వెంటనే వెల్లడించలేదు. సింబాచవెన్ చర్చి తగిన జాగ్రత్తలు తీసుకోలేదని.. సమావేశానికి అనుమతి నిబంధనలను కూడా ఉల్లంఘించారని ఆరోపించారు, ఈ కార్యక్రమం ముందుగా వేసుకున్న ప్రణాళిక కంటే రెండు గంటలు ఆలస్యంగా నడిచిందని అన్నారు. ఈ సంఘటన రాత్రి జరిగింది, చాలా మంది ఉన్నారు, కాబట్టి ఎక్కువ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంది అని ఆయన అన్నారు.

ప్రత్యక్ష సాక్షి అయిన పీటర్ కిలేవో మాట్లాడుతూ.. ఈ దృశ్యం "భయంకరమైనది" అని ప్రజలు "కనికరం లేకుండా తొక్కబడ్డారు, ఒకరినొకరు మోచేతులతో తడుముకుంటు తుదిశ్వాస విడిచారు" అని తెలిపారు. గత సంవత్సరం, దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలోని ఒక చర్చిలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.. ఆఫ్రికాలో సంపన్న బోధకుడు షెపర్డ్ బుషిరి నేతృత్వంలోని సేవలో ఈ ఘటన జరిగింది. అతను 2019 ఫిబ్రవరిలో తన ప్రైవేట్ జెట్‌లో దక్షిణాఫ్రికా నుంచి డబ్బును అక్రమంగా రవాణా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే గత సంవత్సరం, తూర్పు దక్షిణాఫ్రికాలోని ఒక చర్చి భవనం ఈస్టర్ ప్రారంభంలో పాక్షికంగా కూలిపోయింది, భారీ వర్షపాతం కారణంగా ఇది జరగడంతో 13 మంది మరణించగా.. 16 మంది గాయపడ్డారు. తాజాగా టాంజానియన్ తీరంలోని దారెస్సలామ్‌ నగరానికి పాస్టర్ బోనిఫెస్‌ వాంపోసా వెళ్లినట్టు తెలుసుకున్న భక్తులు సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. దాంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చివరకు ఇలా విషాదంలా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories