ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే ఆ దేశంలో మాత్రం ఎన్నికలు

ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే ఆ దేశంలో మాత్రం ఎన్నికలు
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా ప్రజల భద్రత గురించి తీవ్ర ఆందోళనలు ఉన్నప్పటికీ, మే 10 న జరగబోయే పోలాండ్ ఎన్నికలు ముందుకు సాగనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రజల భద్రత గురించి తీవ్ర ఆందోళనలు ఉన్నప్పటికీ, మే 10 న జరగబోయే పోలాండ్ ఎన్నికలు ముందుకు సాగనున్నాయి. ఈ మేరకు ఆపద్ధర్మ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా వెల్లడించారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కాకుండా ఇతర యూరోపియన్ దేశాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, అధ్యక్ష ఎన్నికల ను వాయిదా వేయడం సరికాదని ఆపద్ధర్మ ప్రభుత్వం నొక్కి చెబుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు వెళ్లాలని నిర్ణయించారు.

"ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఒక దుకాణానికి వెళ్ళడానికి ప్రజలకు ఏ విధమైన షరతులు వుంటాయో, అదేవిధంగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళడానికి కూడా షరతులు ఉన్నాయి" అని అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా అన్నారు.. ప్రజలు తనవైపే ఉన్నారని ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చాలా మంది తమ ఓటును స్వేచ్ఛగా ,న్యాయంగా వేసుకోలేమో అని ఆందోళన చెందుతున్నారు. పోల్స్టర్ ఐబిఆర్ఎస్ ప్రకారం, 77 శాతం మంది అధ్యక్ష ఎన్నికలను ఒక సంవత్సరం పాటు వాయిదా వేయడం మంచిదని భావిస్తున్నారు.

అంతేకాదు ఎన్నికలను వాయిదా వేసే ఆన్‌లైన్ పిటిషన్‌లో ఇప్పుడు 270,000 సంతకాలు కూడా ఉన్నాయి. ఒక పిటిషనర్ మరియు ఎలక్షన్ అబ్జర్వేటరీ అసోసియేషన్ ప్రతినిధి మార్సిన్ స్కుబిస్జ్వెస్కీ ఇలా అన్నారు.. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి చేయాలనుకుంటున్నాము అని తెలిపారు. అంతకుముందు జరిగిన ఎన్నికల ప్రకారం, మే లో జరగాల్సిన ఎన్నికలలో ఐదవ వంతు మాత్రమే ఓటు వేసే వేస్తారు. మంగళవారం సాయంత్రం, సార్వత్రిక పోస్టల్ ఓటింగ్‌ను ప్రవేశపెట్టడానికి అధికార లా అండ్ జస్టిస్ (పిఎస్) పార్టీ పార్లమెంటుకు చట్టాన్ని సమర్పించింది.

ఈ చట్టం ప్రకారం కొన్ని వర్గాల ప్రజలకు పోస్టల్ ఓటింగ్‌ను విస్తరించే అవకాశం ఉంది. అంతేకాదు మరికొందరు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు . శుక్రవారం జరిగిన అర్థరాత్రి సెషన్‌లో ఈ చట్టం ప్రతిపాదించబడింది. వాస్తవానికి ఎన్నికలకు కనీసం ఆరు నెలల ముందు ఎన్నికల నియమావళికి సవరణలు చేయాలి, కానీ ఈ చట్టం ఎన్నికలకు రోజుల వ్యవధిలో తీసుకురావడం.. ఎన్నికల విధానాలను ఉల్లంఘిస్తుందని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.

చట్టం ఆమోదించినట్లయితే, విదేశాలలో నివసిస్తున్న 200,000 మంది ఓటర్లు - స్థానిక ఆంక్షలు మరియు మూసివేసిన కాన్సులర్ కార్యాలయాలు తమ ఓటు హక్కును కోల్పోతామని ఆందోళన చెందుతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories