Shehbaz Sharif: పాక్ ప్రధానికి నోటిదూల ఎక్కువే..మళ్లీ నోరు పారేసుకున్న షెహబాజ్

Shehbaz Sharif: పాక్ ప్రధానికి నోటిదూల ఎక్కువే..మళ్లీ నోరు పారేసుకున్న షెహబాజ్
x
Highlights

Shehbaz Sharif: పహల్గామ్ ఉగ్రాడి ఘటన దురద్రుష్టకరమంటూనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్లీ నోరుపారేసుకున్నారు. 1971 యుద్ధం నాటి ఓటమికి తాము ప్రతీకారం...

Shehbaz Sharif: పహల్గామ్ ఉగ్రాడి ఘటన దురద్రుష్టకరమంటూనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్లీ నోరుపారేసుకున్నారు. 1971 యుద్ధం నాటి ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల నెలకున్న యుద్ధ వాతావరణం ప్రమాదకర మలుపు తీసుకుని ఉండేదన్నారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ముజఫరాబాద్ లో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చెక్కులను అందించారు.

పహల్గామ్ ఘటన దురద్రుష్టకరం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏ క్షణంలోనైనా తీవ్ర రూపం దాల్చే పరిస్థితులు ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు. ఉగ్రదాది ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని కోరినా భారత్ దాన్ని తిరస్కరించిందని అన్నారు. పహల్గామ్ ఘటనపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తునకు తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

పహల్గామ్ ఉగ్రవాదికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సింధూర్ తో ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. మే 7న పాకిస్తాన్ పీవోకేలోని ఉగ్రమూకల శిబిరాలను సైన్యం నెలమట్టం చేసింది. తర్వాత మే 8 నుంచి మూడు రోజుల పాటు సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. పదే పదే కవ్వింపు చర్యలకు దిగింది. దీంతో భారత్ కూడా దీటుగా బదులిచ్చింది. భారత సైన్యం దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్..చివరకు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడంతో సరిహద్దుల్లో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories