PM Modi: UAE చేరుకున్న ప్రధాని మోడీ

PM Modi Arrives in UAE
x

PM Modi: UAE చేరుకున్న ప్రధాని మోడీ

Highlights

PM Modi: అబుదాబి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని చర్చలు

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని యూఏఈ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఒక్కరోజు పర్యటనలో భాగంగా వివిధ అంశాలపై యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోదీ చర్చలు జరుపనున్నారు.

ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సత్సంబంధాలపై చర్చించి కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇంధన, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత లాంటి అంశాలపై యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని చర్చలు జరపనున్నారు. అలాగే ఫిన్‌టెక్‌, రక్షణ, సాంస్కృతిక విభాగాల్లో కూడా భారత్, యూఏఈల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories