Nepal: నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. 30మందికి పైగా ప్రయాణికులు మృతి

Plane Crashes Runway Pokhara international Airport Nepal
x

Nepal: నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. 30మందికి పైగా ప్రయాణికులు మృతి

Highlights

Nepal: విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది

Nepal: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మందికిపై ప్రయాణికులు మృతిచెందారు. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. 72 సీట్ల సామర్థ్యం కలిగిన 'యెతి ఎయిర్‌లైన్స్‌ విమానం'.. ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో మొత్తం 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం పాత విమానాశ్రయానికి.. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్య జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. పొఖారా ఎయిర్‌పోర్టులోకి విమానాల రాకపోకలను నిలిపివేశారు. పోఖారా విమానాశ్రయంలో కూలిన విమానంలో 53 నేపాలీయులు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఒక ఐరిష్, ఇద్దరు కొరియన్లు, అర్జెంటీనా, ఫ్రెంచ్ జాతీయుడు విమానంలో ఉన్నారు. నేపాల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ యతి ఎయిర్‌లైన్స్ చరిత్రలో ఈ ప్రామదం 14వది కావడంవ గమనార్హం. ఇక ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో మొత్తం 150 మందికి పైగా మరణించారు. మరోవైపు యతి ఎయిర్‌లైన్స్‌ను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories