International Wonder : అదో వింత ప్రపంచం.. ఆడా, మగా కాని మూడో జీవన విధానం వారి సంప్రదాయం!

International Wonder : అదో వింత ప్రపంచం.. ఆడా, మగా కాని మూడో జీవన విధానం వారి సంప్రదాయం!
x
Highlights

అదో వింత ప్రపంచం. అచ్చం సినిమాల్లో చూపించినట్టు ఉంటుంది. అక్కడో వింత సంప్రదాయం. మగవారిగా పుట్టిన వారినీ ఆడవారిగా అలంకరించేసి.. అదే విధంగా తయారు చేసేస్తారు. వారిని వారు మూడో రకంగా చెప్పుకుంటారు. దానికి వారు పెట్టుకున్న ముద్దు పేరు మహు..అంటే మూడో లింగం అని అర్థం అట. ఈ వింత ద్వీపం దక్షిణ పసిఫిక్ ద్వీపాలకు చేరువలో ఉంటుంది. దాని విశేషాలు మీకోసం..

అద్భుత ద్వీపం అనే చిత్రంలో మగవాళ్లు అంతా పొట్టివాళ్లుగా, స్త్రీలు ఎత్తుగా ఉంటారు. ఇక భైరవ ద్వీపం అనే చిత్రంలోనూ ఒక పాటలో వేలడంతా సైజులో పొట్టివాళ్లు కనిపిస్తారు. దేవ కన్యలు, వింతైన మనుషులు వారి వేషదారణలు అన్ని సినిమాల్లోనే చూస్తూంటాం.. అదంతా సినిమాల్లోనే అనుకుంటాం, భూమిపైనా అటువంటి ఓ ద్వీపం ఉంది. అక్కడ నివసించేవారు వింతగా ఉంటారు. వారినే "మహు" మూడో లింగం (third gender ) అంటారు.

ఆ దీవిలో నివాసం ఉండే వారు అంతా ఆడవారుకాదు , పురుషులు కాదు మూడో భేదానికి చెందిన వారట.. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది కాదు...పై ఫోటోలో చూస్తే ఎదో సినిమాకు చెందినదో, లేక మ్యాగజైన్ లో ఆడిషన్స్ కోసం తీసిన ఫోటోలా అనిసిస్తుంది. కానీ వారు నిజంగా మూడో లింగమని వారే చెబుతున్నారు. అది ఎక్కడో కాదు దక్షిణ పసిఫిక్ దీవుల దగ్గరలోని ఉన్న పొలినేషియన్ దీవి ఆదీవి పేరు తహితీ. ఆ దీవిలో ప్రాచీన ఆధ్యాత్మిక మహు జాతికి చెందిన మనుషులు ఇప్పటికీ నివసిస్తున్నారు. వారంతా నీలం, గులాబీ, పసుపు రంగు వేసుకొని,ఆకులు, పూలతో కూడిన దండలు, దుస్తువులు ధరిస్తారు.

అయితే వారు మగవారిగానే పుడతారు. ఆవిషయాన్ని వారి కుంటుంబ సభ్యలు దాచి మూడవ జాతికి చెందిన వారిగా వేషధారణ అలవాటు చేస్తారు. ఈ విషయాన్ని ప్రముఖ ఫొటో గ్రాఫర్ లమ్సా లియూబా వెల్లడించారు. స్విట్జర్లాండ్ లోని ఫోటో ఎగ్జిబిషన్ లో ఇల్యూషన్ పేరిట పదర్శిస్తారని వివరించారు. లమ్సా లియూబా ఆ ప్రాంతాన్ని వెళ్లి సందర్శిచారు. అయితే వారిని ఫోటోలు తీయడానికి మొదట వారు ఒప్పుకోలేదానీ, చాల సేపు వారితో మాట్లాడి.. బ్రతిమిలాడితే వారు ఫొటోలు తీయనిచ్చారని లమ్సా లియూబా తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories