347 మంది ప్రయాణీకులు.. 18 మంది సిబ్బంది.. బోయింగ్ విమానం ఇంజిన్ లో మంటలు.. అప్పుడేం జరిగిందో చూడండి!

347 మంది ప్రయాణీకులు.. 18 మంది సిబ్బంది.. బోయింగ్ విమానం  ఇంజిన్ లో మంటలు.. అప్పుడేం జరిగిందో చూడండి!
x
Highlights

తృటిలో ప్రమాదాన్ని తప్పించుకుని క్షేమంగా ల్యాండ్ అయింది ఫిలిప్పీన్స్ కి చెందిన ఓ బోయింగ్ విమానం. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అదోబోయింగ్ విమానం.. 347 మంది ప్రయాణీకులు.. 18 మంది సిబ్బంది.. ప్రయాణం ప్రారంభించింది.. ఇంతలో ఇంజన్ లో మంటలు.. అత్యంత ప్రమాదకార పరిస్థితి. ఈ స్థితిలో విమానాన్ని చాకచక్యంగా ఎమర్జెన్సీ లాండింగ్ చేసి అందర్నీ రక్షించాడు ఆ పైలట్.

సినిమాల్లో చూపించే సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సాగిన ఆ బోయింగ్ ప్రయాణం వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ అరుదైన ప్రమాదకర ఎమర్జెన్సీ లాండింగ్ లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలో ఈ నెల 21 వతేదీ అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు చోటు చేసుకుంది.

ఫిలిప్పీన్స్ కి చెందిన ఈ బోయింగ్ 777 విమానం లాస్ ఏంజిల్స్ నుంచి బయలు దేరిన కొద్దీ సేపటికే ఇంజన్ లో లోపాలు తలెత్తినట్టు పైలట్ లాస్ ఏంజెల్స్ ఎయిర్పోర్ట్ కు సమాచారం అందించారు. దీంతో వెంటనే విమానం ఎమర్జెన్సీ లాండింగ్ కు అనుమతి ఇచ్చారు.

విమానములోని రెండు ఇంజన్లలో ఒకదాని నుంచి మంటలు రావడం తాము గమనించామని స్థానిక ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు ఎన్డీటీవీ తన కథనం లో పేర్కొంది. ఇలా విమానం నుంచి మంటలు వస్తుండగా ల్యాండ్ అవడం తామెప్పుడూ చూడలేదని వారు తెలిపారు.

పైలట్ అప్రమత్తత తో విమానానికి భారీ ప్రమాదం తప్పిందని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ ఎడ్మినిస్ట్రేషన్ తెలిపినట్టు ఎన్డీటీవీ కథనంలో పేర్కొన్నారు. మొత్తమ్మీద 360 మందికి పైగా తమ ప్రాణాలు దక్కించుకోగలిగారు.

ఈ విమానం ఎమర్జెన్సీ లాండింగ్ అవుతున్న దృశ్యాన్ని మీరూ చూడండి.


గమనిక: ఈ వీడియో HMTV కి చెందినది కాదు. వైరల్ గా మారిన ఈ వీడియో ను యధాతథంగా ఇక్కడ పాఠకుల కోసం ఇవ్వడం జరుగుతోంది. ఈ వీడియోకి సంబంధించిన అభిప్రాయాలతో HMTV కి ఎటువంటి సంబంధమూ లేదని గమనించగలరు.

కాగా, ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఒక మహిళ విమానం లోపలి నుంచి వీడియో తీసి తన స్నేహితుడు క్రిస్ అంకారాలో కి పంపించారు. దానిని అయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ యధాతథంగా మీకోసం..Show Full Article
Print Article
Next Story
More Stories