యూకేలో ప్రారంభమైన ఫైజర్ టీకా పంపిణీ

యూకేలో ప్రారంభమైన ఫైజర్ టీకా పంపిణీ
x
Highlights

కరోనా నియంత్రణకు బ్రిటన్ చర్యలు ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ రూపొందించిన టీకాను బ్రిటన్ పంపిణీ ప్రారంభించింది. తొలి టీకాను 90 ఏళ్ల వృద్ధురాలు మార్గరేట్ కీనన్‌కి ఇచ్చారు.

కరోనా నియంత్రణకు బ్రిటన్ చర్యలు ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ రూపొందించిన టీకాను బ్రిటన్ పంపిణీ ప్రారంభించింది. తొలి టీకాను 90 ఏళ్ల వృద్ధురాలు మార్గరేట్ కీనన్‌కి ఇచ్చారు. నార్త్ ఐర్లాండ్‌ ప్రాంతానికి చెందిన బామ్మకు కోవిడ్ టీకానిచ్చారు. దీంతో ఫైజర్- బయోఎన్‌టెక్ కోవిడ్ టీకాను ప్రపంచంలోనే తొలిసారి తీసుకున్న వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందారు..

బ్రిటన్ దేశ వ్యాప్తంగా కోవిడ్ టీకాను 80 ఏళ్లు దాటిన వారికి ఇవ్వనున్నారు. వారితో పాటు ఆరోగ్య, కేర్ సిబ్బందికి పంపిణీ చేయనున్నారు. కోవిడ్‌కు గురయ్యే వారికి ముందు టీకా ఇవ్వాలని ప్రధాని బోరిస్ ఆదేశించారు. ఈ ఏడాది చివరకు 40 లక్షల మందికి టీకాను ఇవ్వాలని బ్రిటన్ భావిస్తుంది. ఆ దిశగా పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఫైజర్ టీకాను అనుమతి ఇచ్చి, దాన్ని వాడుతున్న తొలి దేశంగా బ్రిటన్ నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories