టవల్‌ను మింగేసిన పెంపుడు కొండచిలువ

టవల్‌ను మింగేసిన పెంపుడు కొండచిలువ
x
Highlights

కుక్కను పెంచుకుంటారు.. లేదా పిల్లిని పెంచుకుంటారు.. అయితే ఆస్ట్రేలియాలో సాశ్ అనే వ్యక్తి కొండచిలువను పెంచుకుంటున్నాడు.

కుక్కను పెంచుకుంటారు.. లేదా పిల్లిని పెంచుకుంటారు.. అయితే ఆస్ట్రేలియాలో సాశ్ అనే వ్యక్తి కొండచిలువను పెంచుకుంటున్నాడు. దానికి మౌంటీ అనే పేరు కూడా పెట్టాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. పెంపుడు కొండచిలువతో బీచ్‌కు వెళ్లిన అతడికి విచిత్ర పరిస్థితి ఎదురైంది.

ఆకలేస్తే దేనినైనా మింగేసే కొండచిలువ .. బీచ్‌లో తన ఎదురుగా ఉన్న టవల్‌ను మింగేసిందంట. దానికి స్నాక్స్ తినిపిద్దామని సాశ్ ప్రయత్నించిన టైంలో.. అది అవస్థ పడుతూ ఉందని గమనించాడు. వెంటనే దానిని వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాడు.

దీంతో కొండచిలువ మౌంటీ కడుపులోని.. టవల్‌ను చాకచక్యంగా బయటకు తీశారు వైద్యులు. ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను ఫోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories