'ఎగిరే పళ్ళాలు' చూస్తారా? ఇవిగో.. వీడియోలు విడుదల చేసిన అమెరికా రక్షణ సంస్థ

ఎగిరే పళ్ళాలు చూస్తారా? ఇవిగో.. వీడియోలు విడుదల చేసిన అమెరికా రక్షణ సంస్థ
x
UFO (image from video released by Pentagon)
Highlights

'ఎగిరే పళ్ళాలు' UFO లకు సంబంధించి దశాబ్దాలు గా మౌనం వహించిన అమెరిక రక్షణ సంస్థ తొలిసారిగా మూడు వీడియోలు విడుదల చేసింది.

ఎగిరే పళ్ళాలు అని మనం పిలుచుకునే UFO(Undifined Flying Objets) గురించి ఎన్నోసార్లు విని వుంటారు. గతంలో చాలా మంది దానికి సంబంధించిన వీడియోలు విడుదల చేశారు. అయితే, అవి నిజమో కాదో తెలీని పరిస్థితి. ఇక ఈ UFOల చుట్టూ కథలల్లుతూ చాలా సినిమాలూ వచ్చాయి. ఎలియన్స్ (గ్రహాంతర వాసులు) ఈ ఎగిరే పళ్లలలో భూమి పైకి వస్తున్తారంటూ రకరకాల కథనాలు వెలువడ్డాయి.

సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా లో ఈ UFOల గురించి ఎప్పుడూ ఎదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. కానీ, అమెరికా ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ వీటిని అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే, తాజాగా సోమవారం అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ అధికారికంగా UFOల వీడియోలు విడుదల చేసింది.

UFO ల పై ప్రజల్లో చాలాకాలంగా ఉన్న రకరకాల ఊహాగానాలకు చెక్ పెట్టేందుకే ఈ వీడియోలను విడుదల చేస్తున్నట్టు పెంటగాన్ పేర్కొంది. అయితే వాటిని UFOలుగా మాత్రం పెంటగాన్ చెప్పలేదు. ''ఆకాశంలో వర్ణించడానికి వీలుకాని దృశ్యాలు'' అంటూ వ్యాఖ్యానిస్తోంది.

అయితే, ఈ వీడియోలు కొత్తగా బయటపడినవి ఏమీ కాదు. తొలుత 2007 లోనూ తరువాత 2017 లోనూ వీటిని కొందరు విడుదల చేశారు. ఇవి మొత్తం మూడు వీడియోలు. వాటిలో రెండు వీడియోలు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ఇంకొకటి మాత్రం UFOల పై పరిశోధనలు చేయడానికి 2017 లో అమెరికాకు చెందిన మాజీ బ్లింక్ -182 గాయకుడు టామ్ డెలాంగ్ ప్రారంభించిన స్వతంత్ర సంస్థ విడుదల చేసింది.

అసలు ఈ వీడియోల్లో ఏముంది..

- మొదటిసారిగా న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం, 2004లో ఇద్దరు నేవీ ఫైటర్ పైలట్లు ఈ వీడియోను చిత్రీకరించారు. వారు పసిఫిక్ మహాసముద్రంలో 100 మైళ్ళు (160 కిమీ) దూరంలో నీటి పైన ఒక గుండ్రని వస్తువు ఉన్నట్లు పేర్కొంటూ ఈ వీడియో చిత్రీకరించారు.

- 2015 లో చిత్రీకరించినట్టు చెప్పబడిన మరో రెండు వీడియోలలో గాలి ద్వారా కదులుతున్న వస్తువులు కనిపిస్తాయి. వాటిలో ఒకటి తిరుగుతోంది. ఈ వీడియోలు చిత్రీకరిస్తున్న సమయంలో ఒక పైలట్ "ఆ విషయం చూడండి, వాసి! ఇది తిరుగుతోంది!"

అని చెప్పడం వినిపిస్తుంది.

పెంటగాన్ ఈ వీడియోలు విడుదల చేయడం ద్వారా మంచి పని చేసిందని అమెరికాకు చెందిన మాజీ సెనేటర్ హరీ రీడ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇదే విషయంపై UFO ల పై పరిశోధనలు చేస్తున్న స్వతంత్ర సంస్థ స్థాపించిన మాజీ గాయకుడు టామ్ డెలాంగ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. పెంటగాన్ ఈ పని చేయడం ద్వారా UFO ల పై మరిన్ని పరిశోధనలు చేయడానికి ఔత్సాహికులు ముందుకు వస్తారంటూ అయన ట్వీట్ చేశారు.

(పెంటగాన్ అధికారికంగా విడుదల చేసిన వీడియో - Courtesy: The Guardian)




Show Full Article
Print Article
More On
Next Story
More Stories