Coronavirus వ్యాప్తి ఈ జంతువు ద్వారానే జరుగుతోందని అనుమానం!

Coronavirus వ్యాప్తి ఈ జంతువు ద్వారానే జరుగుతోందని అనుమానం!
x
Highlights

పాంగోలిన్ల ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని ఒక అధ్యయనం కనుగొంది. చైనాలోని వుహాన్ లోని...

పాంగోలిన్ల ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని ఒక అధ్యయనం కనుగొంది. చైనాలోని వుహాన్ లోని అడవి జంతు మార్కెట్లలో ఈ వైరస్ వ్యాప్తి ఉద్భవించిందని నిపుణులు భావిస్తున్నారు. 1,000 కంటే ఎక్కువ వైరస్ నమూనాలను సేకరించి వారు పరిశోధనలు చేశారు.

ఈ క్రమంలో పాంగోలిన్లలోని వైరస్ యొక్క జన్యు శ్రేణికి కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు 99% సమానమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే కంగోవైరస్ వ్యాప్తికి పాంగోలిన్లు కారణమని అని విశ్వవిద్యాలయ అధ్యక్షుడు లియు యాహోంగ్ అన్నారు. అయితే ఈ కొత్త సమాచారం వైరస్ నివారణ మరియు నియంత్రణకు సహాయపడుతుందని లియు చెప్పారు.

కొరోనావైరస్ గబ్బిలాలతో ఉద్భవించిందని మానవులకు రావడానికి బహుశా పాంగోలిన్ వంటి మధ్యవర్తి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఇయాన్ లిప్కిన్ బుధవారం మాట్లాడుతూ.. ప్రతి రెండు సంవత్సరాలకు ఇలాంటి వైరస్ లు పుడుతూ ఉంటాయి.. ఇవి తడి మాంసం ద్వారా వృద్ధి చెందుతాయని..

అందువల్ల అడవి జంతువుల మాంసం మార్కెట్లు మూసివేయాలని అభిప్రాయపడ్డారు. అయితే వన్యప్రాణుల మార్కెట్లను మూసివేయడం సరైన పద్ధతి కాదని.. ఇది చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది అని ప్రపంచ వన్యప్రాణి నిధి ఒక ప్రకటనలో తెలిపింది. అంతరించిపోతున్న జంతువులను కాపాడుకోవాలని పేర్కొంది.

కాగా సాంప్రదాయ వైద్యంలో పాంగోలిన్ లను ఉపయోగిస్తారు. పాంగోలిన్లను అంతర్జాతీయ చట్టం ద్వారా రక్షిస్తున్నారు. కాని అవి ఇప్పటికీ ఆసియాలో అత్యధికంగా రవాణా చేయబడిన క్షీరదాలలో ఒకటిగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం, గత దశాబ్దంలో ఒక మిలియన్ పైగా జాతుల మనుగడను ప్రమాదంలో పడేసింది. 2016 లో, పాంగోలిన్ వ్యాపారంపై నిషేధం విధించబడింది, అయితే జంతువుల అమ్మకం ఆసియా మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలావుంటే కరోనా వైరస్ భారిన పడి ఇప్పటివరకు 724 మంది మరణించినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో రెండు మరణాలు మినహా అన్ని చైనాలో సంభవించాయి. ఒకరు ఫిలిప్పీన్స్ లో మరొకరు హాంకాంగ్ లో మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 34,000 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు, వీరిలో ఎక్కువ మంది చైనాలోనే ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories