Pakistan War Threats Against India: భారత్‌తో యుద్ధమే అంటూ రెచ్చిపోయిన పాకిస్తాన్

x
Highlights

భారత్‌తో యుద్ధానికి సిద్ధమని పాకిస్తాన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. తాజా పరిణామాలు, అధికారిక స్పందనలు మరియు ప్రాంతీయ ప్రభావం వివరాలు.

షహబాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ పిఎంఎల్ యువజన విభాగ నాయకుడు రెచ్చిపోయాడు. భారత్ కు హెచ్చరిక జారీ చేశాడు. బంగ్లాదేశ్ పై ఏదైనా దాడి జరిగితే పాకిస్తాన్ సైన్యం క్షిపణలు ప్రతిస్పందిస్తాయి అంటున్నాడు. ఈ మేరకు పీఎంఎల్ నాయకుడు కమ్రాన్ సయ్యద్ ఉస్మాని వార్నింగ్ ఇస్తున్నాడు. అంతేకాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య సైనిక కూటమిని కూడా ఏర్పాటు చేయాలని పిలుపునిస్తున్నాడు. ఒకవేళ భారత్ బంగ్లాదేశ్ సార్వభౌమాధికారంపై దాడి చేసిన బంగ్లాదేశ్ ను దురుద్దేశంతో చూడడానికి సాహసించిన గుర్తుంచుకోండి పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ సాయుధ దలాలు మా క్షిపణలు ఎంతో దూరంగా లేవు అని హెచ్చరిస్తున్నాడు. అఖండ భారత్ సిద్ధాంతాన్ని బంగ్లాదేశ్ పై రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలను పాకిస్తాన్ సహించదు అంటున్నాడు. బంగ్లాదేశ్ ను భారతదేశ సైద్ధాంతిక ఆధిపత్యంలోకి నెట్టడాన్ని పాకిస్తాన్ అంగీకరించదు. బంగ్లాదేశ్ పై దాడి చేసిన దాని స్వయం ప్రతిపత్తిపై చెడు దృష్టి పెట్టిన పాకిస్తాన్ బలవంతంగా స్పందిస్తుంది అంటున్నాడు. ఇక పాకిస్తాన్ గతంలో భారతదేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది అవసరమైతే మళ్ళీ అలా చేయగలదు అని హెచ్చరిస్తున్నాడు. ఇక పాకిస్తాన్ పశ్చిమం నుంచి బంగ్లాదేశ్ తూర్పు నుండి దాడి చేస్తాను అంటున్నాడు. ఇక చైనా అరుణాచల్ ప్రదేశ్ లడాక్ పై దృష్టి సారించింది అని చెబుతున్నాడు. వాళ్ళ ప్రతిపాదన ఏంటంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేసుకోవాలని బంగ్లాదేశ్ లో పాక్ ఒక సైనిక స్థావరాన్ని పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ తమ తమ భూభాగాల్లో ఒకరికొకరు సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించుకోవాలి. ఇటువంటి ఏర్పాటు వ్యూహాత్మక నియంత్రణను బలోపేతం చేస్తుంది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ను బంగ్లాదేశ్ ఓడరేవులతో కలుపుతుంది. ఓడరేవులు సముద్రాలపై నియంత్రణ ఉన్నవారే ప్రపంచాన్ని పాలిస్తారు. ఇక పాకిస్తాన్ బంగ్లాదేశ్ సైనిక భాగస్వామ్యం ప్రాంతీయ అధికార సమీకరణాలను గణనీయంగా మారుస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories