article370: పాక్ మంత్రికి మోడీ షాక్!

article370: పాక్ మంత్రికి మోడీ షాక్!
x
Highlights

భారత ప్రధాని మోడీ పై నోరు పారేసుకుంటున్న పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ కి అకస్మాత్తుగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఈ వార్తా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతోంది. కాకతాళీయంగా అది జరిగినా, మోడీని.. భారత్ నీ ఆదిపోసుకున్తున్నందుకే ఇలా అయింది అంటున్నారు నెటిజన్లు

ఒక్కో సంఘటన ఎందుకు జరుగుతుందో చెప్పలేం. కానీ, ఆ సంఘటన ప్రభావం మాత్రం అందర్నీ ఆలోచింప చేస్తుంది. ముఖ్యంగా వీధుల కెక్కి నోరు పారేసుకుంటున్న వారికి ఇటువంటి సంఘటన ఎదురైతే అది జనాల్లో విపరీతంగా ప్రచారం అవుతుంది. ఇటువంటి సంఘటన ఒకటి పాకిస్తాన్ లో చోటు చేసుకుంది.

ఆర్టికల్‌ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటినుంచీ పాకిస్తాన్ పాలకులు ఇష్టం వచ్చినట్టు భారత దేశం మీదా.. భారత ప్రధాని మీద అవాకులూ, చెవాకులూ పేలుతున్నారు. వారిలో పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ముందు వరుసలో ఉంటున్నారు. సరిగ్గా ఇటువంటి ప్రయతనంలో ఆయన ఉండగా ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టింది. అదెలా అంటే..

ఇస్లామాబాద్‌లో ఓ సమావేశంలో పాక్‌ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశాలేమిటో మాకు తెలుసంటూ వ్యాఖ్యానించారు. అంతే ఒక్కసారిగా షాక్ కొట్టి తుళ్లిపడ్డారు. అవును.. ఆయనకు ఆ సమయంలో వేదికపై కరెంట్ షాక్ కొట్టింది. కాకతాళీయంగా జరిగింది అయినా.. ఈ సంఘటన ప్రస్తుతం అందరిలోనూ చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ దృశ్యాలు ఇప్పుడు నేట్టింట్లో వైరల్ గా మారాయి.

అయితే, ఈసంఘటన జరిగిన వెంటనే ఆ మంత్రి స్పందన కూడా విచిత్రంగా ఉండడం ఇక్కడ గమనార్హం. ఈ సమావేశాన్ని మోడీ విఫలం చేయలేరని ఆయన అన్నారు. దీంతో అందరూ నవ్వుకుంటున్నారు. ఆయనకు మోడీ జ్వరం పట్టుకుందని జోకులేస్తున్నారు.

కశ్మీర్‌ వ్యవహారంలో రషీద్‌ ఇటీవల అనవసరంగా నోరు పారేసుకున్నారు. కశ్మీర్‌ అంశంపై పోరాటానికి నిర్ణయాత్మక సమయం వచ్చేసిందని, సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో భారత్‌- పాకిస్థాన్‌ మధ్య యుద్ధం జరుగుతుందంటూ రావల్పిండిలో జోస్యం చెప్పారు. రెండు దేశాల మధ్య ఇది చివరి యుద్ధం కానుందని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories