పాకిస్థాన్ లో 50 వేలకు చేరువగా కరోనా కేసులు.. రికార్డు స్థాయిలో..

పాకిస్థాన్ లో 50 వేలకు చేరువగా కరోనా కేసులు.. రికార్డు స్థాయిలో..
x
Highlights

పాకిస్థాన్ లో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.. గురువారం 48,000 మార్కును దాటిందని.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధిక పరీక్షలు...

పాకిస్థాన్ లో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.. గురువారం 48,000 మార్కును దాటిందని.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధిక పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్‌లో 2,193 కొత్త కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 48,091 కు చేరుకుంది. 32 కొత్త మరణాలతో మరణించిన వారి సంఖ్య 1,017 గా ఉంది. గత 24 గంటల్లో ఒకే రోజులో అత్యధికంగా 15,346 కరోనావైరస్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 429,600 పరీక్షలు నిర్వహించారు.

అత్యధికంగా సింధ్‌లో 18,964 కేసులు నమోదయ్యాయి, పంజాబ్‌లో 17,382, ఖైబర్-పఖ్తుంఖ్వాలో 6,815, బలూచిస్తాన్‌లో 2,968, ఇస్లామాబాద్‌లో 1,235, గిల్గిట్-బాల్టిస్తాన్‌లో 579, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 148 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 14,155 మంది రోగులు కోలుకున్నారని అధికారులు తెలిపారు. ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి పాకిస్తాన్‌కు రోజుకు 30,000 పరీక్షలు సరిపోతాయని ప్రణాళికా మంత్రి అసద్ ఉమర్ మంగళవారం చెప్పడంతో రోజువారీ పరీక్షల సంఖ్యను పెంచింది ప్రభుత్వం. పాకిస్తాన్ రోజుకు 25 వేలకు పైగా పరీక్షలు చేయగల స్థితిలో ఉందని, మే-ఎండ్ లేదా జూన్ ఆరంభంలో దేశం రోజుకు 30,000 పరీక్షలు నిర్వహించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ దేశ అధికారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories