కుల్ భూషణ్ జాదవ్ నేరస్తుడే:పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

కుల్ భూషణ్ జాదవ్ నేరస్తుడే:పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
x
Highlights

కుల్ భూషణ్ జాదవ్ పాకిస్థాన్ ప్రజలకు వ్యతిరేకంగా నేరాలు చేశాడని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఆయనను విడిచి పెట్టమని,...

కుల్ భూషణ్ జాదవ్ పాకిస్థాన్ ప్రజలకు వ్యతిరేకంగా నేరాలు చేశాడని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఆయనను విడిచి పెట్టమని, ఇండియా కు పంపిచమని అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పలేదని పేర్కొన్నారు. తమ దేశంలోని చట్టాల ప్రకారం తాము ముందుకు వెళతామని అయన చెప్పారు.

ప్రస్తుతం పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న కుల్ భూషణ్ జాదవ్ కు మరణశిక్ష అమలును హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇది భారత్ సాధించిన విజయమని ప్రధాని నరేంద్ర మోదీ, సుష్మా స్వరాజ్ వంటి వారు ఇప్పటికే వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories