పాక్ ప్రధానికి అమెరికాలో అవమానం?

పాక్ ప్రధానికి అమెరికాలో అవమానం?
x
Highlights

సాధారణంగా ఒక దేశానికి (అది చిన్నదైనా, పెద్దదైనా) ప్రధాని వేరే దేశానికి వెళితే, అదీ అధికారిక పర్యటన ఐతే ఆయనకు తగిన స్వాగత సత్కారాలు కచ్చితంగా ఉంటాయి....

సాధారణంగా ఒక దేశానికి (అది చిన్నదైనా, పెద్దదైనా) ప్రధాని వేరే దేశానికి వెళితే, అదీ అధికారిక పర్యటన ఐతే ఆయనకు తగిన స్వాగత సత్కారాలు కచ్చితంగా ఉంటాయి. తమ దేశానికి వచ్చిన వేరేదేశపు ప్రధాని అంటే ఆ మర్యాదలు పద్ధతిగా ఉంటాయి. అయితే, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో పర్యటన కోసం ఆదివారం వెళ్ళారు. ఈ సందర్భంగా ఆ దేశంలో ఆయనకు కనీస స్వాగతం కూడా అమెరికా దేశ ప్రభుత్వం నుంచి లభించలేదు. కేవలం ఓ ప్రోటోకాల్ అధికారి మాత్రమే ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం చెప్పేందుకు వెళ్లారట.

ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో అమెరికా వచ్చిన ఇమ్రాన్‌ కు పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్‌ ఖురేషీ, పలువురు పాకిస్థానీ అమెరికన్లు మాత్రమే స్వాగతం చెప్పడానికి వెళ్లారు. ఆయన బస విషయంలో కూడా సరైన మర్యాద దక్కలేదని తెలుస్తోంది. తమ రాయబారి అసద్‌ మజీద్‌ఖాన్‌ అధికారిక నివాసంలోనే బసచేశారు.

అయితే, మరోవైపు పాకిస్థాన్ లో మాత్రం ఇమ్రాన్ పర్యటనపై పూర్తి మద్దతుతో కూడిన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇతర పాకిస్థాన్ ప్రధానుల్లా ప్రత్యెక విమానం లో కాకుండా.. ఖతార్ ఎయిర్ వేస్ లో సాధారణ ప్రయాణీకుడిలా వెళ్ళారనీ, ఖరీదైన హోటల్ లో బస చేయకుండా అధికారిక నివాసంలోనే బస చేశారనీ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. డబ్బును ఆదా చేయడానికే ఆయన అలా చేశారనీ, వృధా ఖర్చులు పెట్టడానికి ఆయన ఇష్టపడరనీ అంటున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories