గగుర్పొడిచే నిజం.. తవ్వకంలో బయటపడ్డ 6 వేల అస్థిపంజరాలు

గగుర్పొడిచే నిజం.. తవ్వకంలో బయటపడ్డ 6 వేల అస్థిపంజరాలు
x
Highlights

తూర్పు ఆఫ్రికా దేశం బురుండిలో ట్రూత్ అండ్ రికన్సిలిషన్ కమిషన్.. కరుసి ప్రావిన్స్‌లోని సామూహిక సమాధులలో 6,000 మృతదేహాలను కనుగొంది, జనవరిలో...

తూర్పు ఆఫ్రికా దేశం బురుండిలో ట్రూత్ అండ్ రికన్సిలిషన్ కమిషన్.. కరుసి ప్రావిన్స్‌లోని సామూహిక సమాధులలో 6,000 మృతదేహాలను కనుగొంది, జనవరిలో దేశవ్యాప్తంగా ప్రభుత్వం తవ్వకం ప్రారంభించినప్పటి నుండి ఇది అతిపెద్దది అస్థిపంజరాలు సంఖ్య. ఈ తవ్వకంలో మొత్తం 6,032 మంది బాధితుల అవశేషాలతో పాటు వేలాది బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కమిషన్ చైర్మన్ పియరీ క్లావర్ న్దైకారి శుక్రవారం పాత్రికేయులతో అన్నారు. అస్థిపంజరాలతో పాటు, బుల్లెట్లు, బట్టలు, అద్దాలు మరియు ఇతర వస్తువులు కూడా భూమి లోపల నుండి దొరికాయి. మృతదేహంతో ఉన్న వస్తువులతో ఆ మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బురుండిలో టుట్సీ మరియు హుటు జాతులు ఉన్నాయి. అయితే వారిధ్దరి మధ్య అంతర్యుద్ధం మొదలయింది.. 1993 నుంచి అది మరింత తీవ్రమైంది. చివరకు 2005 వరకు కొనసాగింది. ఈ అంతర్యుద్ధంలో సుమారు 3 లక్షల మంది చనిపోయారు. జాతిపరమైన ఉద్వేగాలే దీనికి కారణంగా నిలిచింది. అంచనాల ప్రకారం 1965, 1969, 1972, 1988 మరియు 1993 లో బురుండిలో హుటు మరియు టుట్సీ సమూహాల ప్రజలు ఊచకోతకు గురయ్యారు. అయితే 2005 లో ఒక పరిష్కారం తరువాత, అంతర్యుద్ధాన్నినిలిపివేశారు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా 4 వేల సామూహిక సమాధులు తవ్వి మృతదేహాలని గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సత్య, సయోధ్య కమిషన్‌ను రూపొందించారు.

అంతర్యుద్ధాన్ని అంతం చేయడానికి ఏర్పాటు చేసిన శాంతి ఒప్పందం పూర్తిగా అమలు కాలేదు.. ఈ క్రమంలో 2014 లో అంతర్యుద్ధంపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 1885 నుండి విదేశీయులు బురుండికి వచ్చారని.. ఇది 2008 వరకు కొనసాగిందని గుర్తించింది. ఇప్పటివరకు ఇది దేశవ్యాప్తంగా సమాధులను గుర్తించడం తోపాటు హింసకు గురైన వారు 142,000 మందికి పైగా ఉన్నారని గుర్తించింది. అయితే 2005 లో అధికారం చేపట్టిన ప్రస్తుత అధ్యక్షుడు పియరీ న్కురుంజిజా పాలనలో దీనిపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలో 2020 మే ఎన్నికలకు ముందే మానవ హక్కుల ఉల్లంఘన మరోసారి పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. దాంతో తవ్వకం పునప్రారంభించడంతో పెద్దఎత్తున అస్థిపంజరాలు బయటపడ్డాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories