సింగపూర్ లో 1,037 కొత్త కేసులు నమోదైతే.. 99శాతం విదేశీయులే..

సింగపూర్ లో 1,037 కొత్త కేసులు నమోదైతే.. 99శాతం విదేశీయులే..
x
Highlights

సింగపూర్ లో కరోనా సంక్రమణ వేగంగా వ్యాపిస్తుంది. గడిచిన 24 గంటల్లో 1,037 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 11,178 కు చేరుకున్నాయి. కొత్తగా...

సింగపూర్ లో కరోనా సంక్రమణ వేగంగా వ్యాపిస్తుంది. గడిచిన 24 గంటల్లో 1,037 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 11,178 కు చేరుకున్నాయి. కొత్తగా పాజిటివ్ తేలిన వారిలో కేవలం 13 మంది మాత్రమే సింగపూర్ వాసులు ఉన్నారు.. మిగిలిన వారంతా విదేశీ కార్మికులే.. ఇందులో భారతీయ పౌరులతో సహా ఇతర దేశాల వారు కూడా ఉన్నారు. వీరంతా స్థానిక పరిశ్రమలలో పనిచేస్తున్నారు .. వీరు ప్యాక్ చేసిన వసతి గృహాలలో నివసిస్తున్నారు. ఇక దేశంలో నమోదైన మొత్తం కేసులలో 924 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు. సింగపూర్ లో కేవలం 12 మంది మాత్రమే మరణించారు.

ఏప్రిల్ ప్రారంభంలో కరోనా వైరస్ పై ఇక్కడ పరిశోధనలు తీవ్రతరం అయ్యాయి.. ఆ తరువాతనే కొత్త సంక్రమణ కేసులు విజృంభించాయి. ఇదిలావుంటే సింగపూర్ వాసుల మాదిరిగానే.. సింగపూర్‌లో పనిచేస్తున్న భారతీయ పౌరులను కూడా చూసుకుంటామని సింగపూర్ ప్రధాని లీ హ్సేన్ లూంగ్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారు. మహమ్మారి పరిస్థితి గురించి సింగపూర్ ప్రధాని మోడీతో ఫోనులో మాట్లాడినట్టు లీ గురువారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories