Optic Fibre Drones: యుద్ధాన్ని శాసిస్తున్న డ్రోన్లు.. రష్యా-యుక్రెయిన్‌ వార్‌లో గేమ్‌ ఛేంజర్‌!

Optic Fibre Drones
x

Optic Fibre Drones: యుద్ధాన్ని శాసిస్తున్న డ్రోన్లు.. రష్యా-యుక్రెయిన్‌ వార్‌లో గేమ్‌ ఛేంజర్‌!

Highlights

Optic Fibre Drones: రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇన్నాళ్లు ఇరు దేశాలు భయంకరమైన మిస్సైళ్ల గురించి భయపడుతూ వచ్చాయి కానీ.. ఇప్పుడు గాల్లో తేలుతూ వచ్చే భయం పేరు మారింది.

Optic Fibre Drones: రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇన్నాళ్లు ఇరు దేశాలు భయంకరమైన మిస్సైళ్ల గురించి భయపడుతూ వచ్చాయి కానీ.. ఇప్పుడు గాల్లో తేలుతూ వచ్చే భయం పేరు మారింది. రేడియో తరంగాలు కూడా జామ్ చేయలేని ఆ ఆయుధం పేరు ఆప్టిక్ ఫైబర్ డ్రోన్. యుద్ధంలో వాడే ఈ రహస్య ఆయుధం.. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలకు కూడా చిక్కదు. ఇది ఒక మామూలు డ్రోన్ కాదని తెలుసుకునేలోపే... ఒక నగరం అగ్నిగుండంగా మారుతుంది. ఇంతకీ ఏంటి ఆప్టికల్ ఫైబర్ డ్రోన్?

ఆప్టిక్ ఫైబర్ డ్రోన్ గాలిలో ప్రయాణించే సాధారణ డ్రోన్‌ కాదు. భూమి మీద ఉన్న ఓ కంట్రోలర్‌కు ఫైబర్ కేబుల్ ద్వారా ఇది నేరుగా కనెక్ట్ అయి ఉంటుంది. అదే ఈ డ్రోన్‌కు అసలైన శక్తి. ఈ కేబుల్ వేల మీటర్ల పొడవునా ఉంటుంది. రేడియో సిగ్నల్ అవసరం లేకుండానే ఈ డ్రోన్ పనిచేస్తుంది. అందుకే దాన్ని జామ్ చేయడం అసాధ్యం. ఇవి సైలెంట్‌గా గమ్యం వైపు సాగిపోతాయి. ఈ సాంకేతిక అస్త్రాన్ని యుద్ధంలో ముందుగా రష్యా వాడింది. మొదట చిన్న స్థాయి యుద్ధంగా ప్రారంభమైనా.. ఇప్పుడు అది వార్‌ విధానాన్నే మార్చేస్తోంది. యుక్రెయిన్ భద్రతా వ్యవస్థలు దీన్ని గుర్తించేలోపే నష్టం జరిగిపోతుంది. రష్యన్ ఆప్టిక్ ఫైబర్ డ్రోన్లు పట్టణాలపై చీకటి కప్పేసేలా విసురుతున్నాయి. సిగ్నల్‌ జామింగ్ సిస్టమ్స్ పనికిరావు. కేవలం చూపు మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు యుద్ధంలో విజయం సాధించాలంటే.. గాల్లో కాకుండా తీగలను గుర్తించే నైపుణ్యం అవసరం.

ఇటు యుక్రెయిన్ సైనికులు ఇప్పటికే స్థావరాలను వదిలి చీకటిలోకి వెళ్లిపోతున్నారు. ఈ డ్రోన్ ఎప్పుడూ సైలెంట్‌గా వెంబడిస్తూ ఉంటుంది. ఎక్కడ నిలబడాలి? ఎప్పుడు కదలాలి? ఏదైనా డ్రోన్ నన్ను గమనిస్తుందా? అనే అనుమానంలో రోజులు గడుపుతున్నారు. కొందరు సైనికులు మూడు రోజుల పాటు నిద్రలేకుండానే నిలబడి ఉంటున్నారు. చలిలో, బురదలో, ఆకలితో.. కనీస విశ్రాంతి లేకుండా బతుకుతున్నారు. డ్రోన్ ఎగురుతుంటే, అది కనిపించినా, కనిపించకపోయినా.. భయం మాత్రం ఎప్పుడూ వారితో ఉంటుంది. డ్రోన్ల వల్ల ఇప్పుడు యుద్ధం కేవలం తుపాకీ కాల్పుల సంగతి కాదు. ప్రతి క్షణం మనశ్శాంతి మీద పోరాటమవుతోంది. పగటి వెలుతురు పడక ముందే రష్యా వదిలిన ఆప్టిక్ ఫైబర్ డ్రోన్లు గాలిలో ఎగురుతున్నాయ్. నిజానికి టెక్నాలజీ మనిషి జీవనాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో వచ్చింది కానీ.. ఇప్పుడు అదే టెక్నాలజీ మానవత్వాన్ని భయంతో ముంచెత్తుతోంది. ఒక చిన్న తీగ కేవలం డ్రోన్‌ను మాత్రమే కాదు.. మనిషి గుండె ధైర్యాన్ని కూడా లాగేస్తోంది. ఇటు యుద్ధం అంటే ఒక్కరిపై మరొకరు కాల్పులు జరిపే పోరాటం కాదు. అది కనబడని డ్రోన్లతో, వినపడని భయాలతో నడిచే ఆరాటం. ఇలా గాలిలో ఎగిరే డ్రోన్లు మన భవిష్యత్తు యుద్ధాలను ఎలా మలుస్తాయో తెలీదు.

Show Full Article
Print Article
Next Story
More Stories