వయసు 62.. రాయిలాంటి శరీరంతో గిన్నిస్ రికార్డు కొట్టేశాడు!

వయసు 62.. రాయిలాంటి శరీరంతో గిన్నిస్ రికార్డు కొట్టేశాడు!
x
Highlights

ఏభై ఏళ్ళు వచ్చేసరికే అమ్మో అబ్బో అని ఆపసోపాలు పడిపోతారు చాలామంది. ఇక ఎవరెంత చెప్పినా వీసమెత్తు వ్యాయామాలు చేయాలన్నా కొండంత బద్ధకం ఎక్కువమందికి....

ఏభై ఏళ్ళు వచ్చేసరికే అమ్మో అబ్బో అని ఆపసోపాలు పడిపోతారు చాలామంది. ఇక ఎవరెంత చెప్పినా వీసమెత్తు వ్యాయామాలు చేయాలన్నా కొండంత బద్ధకం ఎక్కువమందికి. వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని డాక్టర్లు చెప్పినా.. ఎవరు చెప్పినా దానికోసం ఎంత మాత్రం పట్టించుకునే తీరికా ఓపికా ఉండవు. ఇదిగో ఈ పెద్దాయన గురించి వింటే.. వ్యాయామం గొప్పతనం.. వ్యర్ధక్యం వచ్చినా పట్టుసడలని ఆరోగ్యం ఎలా దొరుకుతుందో అర్ధం అవుతుంది.

ఈయన పేరు గిన్నిస్ బుక్ కే బాగా తెల్సు. అమెరికాకు చెందిన జార్జి హుడ్ వయసు 62 ఏళ్ళు. రాయిలాంటి వాడు అనే పదానికి అచ్చమైన ఉదాహరణ. ఈయన ప్రత్యేకత ఏమిటీ అంటారా? తన ఒంటిని బండరాయిలా నెలకు సమాంతరంగా కేవలం కాళ్ళూ చేతులూ ఆధారంగా గాలిలో ఎక్కువసేపు ఉంచగలడు. దీనిని ప్లాంక్ పొజిషన్ అంటారు. ఇలా చాలామంది చేస్తారుగా అనుకోకండి. ఎవరైనా చేస్తే ఓ ఐదు నిమిషాలు మహా అయితే పది నిమిషాలు ఈ పొజిషన్లో ఉండగలరు. ఇంకా గొప్పగా చెప్పుకున్నా ఓ గంట (ఇది కూడా చాలా తక్కువ మంది మాత్రమె సుమండీ!) ఉండగలుగుతారు. కానీ ఈ తాత గారు.. తప్పేమో ఈ పెద్దాయన మాత్రం ఏకంగా 8 గంటల 15 నిమిషాల 15 సెకెన్ల పాటు ఈ పొజిషన్‌లోనే ఉండి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారికి కూడా ఈ ప్లాంక్ పొజిషన్ లో ఇంత వరకూ ఇంత సేపు ఏకధాటిగా ఉన్నవారెవరూ లేరని గుర్తొచ్చి తమ రికార్డుల్లోకి ఈయనను ఎక్కించేశారు. ఈయన కంటే ముందు చైనా కు చెందిన మావో వీడాంగ్ పేరుమీద ఈ రికార్డు ఉందట.

ఇక ఈ రికార్డు కోసం జార్జి హుడ్ ఎలా ప్రయత్నించారో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. రోజుకు ఏడుగంటల పాటు దీనికోసం శ్రమించారట. అంతే కాదు, ఈయన రోజుకు 700 పుషప్స్ చేసేవారట. ఇక ఇలా ఈ పొజిషన్ ఎలా చేస్తారంటే...పుషప్స్ ప్రారంభించే ముందు రెండు చేతులపై దేహాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉదరభాగాన్ని నేలకు తాకకుండా ఉంచుతారు. దీనినే ప్లాంక్ పొజిషన్ అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పెద్దాయన సాహసం విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అంతేకాదు. ఈయన మీద నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వావ్..పెద్దాయనా..కీపిటప్!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories