Old Ingledew: మద్యం బాటిల్ ఖరీదు కోటి రూపాయలు

Old Ingledew Whiskey Bottle Sold For One Crore Rupees in England Auction
x

ఓల్డ్ ఇంగ్లేడ్వ్ (ఫైల్ ఫోటో)

Highlights

Old Ingledew: అవును మీరు చదివింది నిజమే..!! ఆదివారం సాయంత్రం ఎక్కిన మత్తు దించేలా ఉన్న ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మాములుగా...

Old Ingledew: అవును మీరు చదివింది నిజమే..!! ఆదివారం సాయంత్రం ఎక్కిన మత్తు దించేలా ఉన్న ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మాములుగా మందు బాబులు తమ ఆర్థిక పరిస్థితిని బట్టి సమయాన్ని బట్టి రకరకాల బ్రాండ్ లను తీసుకుంటారు. అయితే ఇప్పుడు మీరు విన్న ఈ మద్యం బాటిల్ మాత్రం దాదాపుగా 250 ఏళ్ళ క్రితం తయారు చేసినది కాబట్టి ఆ విస్కీ బాటిల్ కి అంత రేటు. ఈ బాటిల్ సౌత్ కరోలినా లోని న్యూ బెర్రీలోని ఒక ఎస్టేట్ లో దొరికింది. ఇంగ్లాండ్ లోని స్కినర్ ఇంక్ అనే ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన ఈ వేలం పాటలో ది మోర్గాన్ లైబ్రరీ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1,37,000 డాలర్లకు (సుమారుగా భారత కరెన్సీ లో కోటి రూపాయలు) సొంతం చేసుకుంది.

ఇది ఇప్పటివరకు మార్కెట్ లో ఉన్నటువంటి మాములు విస్కీ కాదని, ప్రపంచంలోనే అత్యంత ఖరీదు అయిన మద్యం అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విస్కీ పేరు "ఓల్డ్ ఇంగ్లేడ్వ్". 1860 లో తయారు చేసిన ఈ మద్యం సుమారుగా 15 లక్షల వరకు అసలు రేటు ఉండగా ఈ వేలం పాట వలన అసలు ధర కంటే దాదాపుగా 6 రెట్లు పెరిగి కోటి రూపాయలకు చేరింది. "ఓల్డ్ ఇంగ్లేడ్వ్" బాటిల్ ని కోటి రూపాయలకు కొన్న ది మోర్గాన్ లైబ్రరీ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఏ మాత్రం కిక్ ఎక్కుతుందో తెలిదు కాని మిగిలిన వారికి మాత్రం ఈ రేటు మత్తు వదిలించేదిలా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories