ఓ నవలలో 40 ఏళ్ల కిందటే కరోనా ప్రస్తావన..!

ఓ నవలలో 40 ఏళ్ల కిందటే కరోనా ప్రస్తావన..!
x
40 ఏళ్ల కిందటే ఓ నవలలో కరోనా గురించి ప్రస్తావన
Highlights

-1981లో వచ్చిన ద ఐస్ ఆఫ్ డార్క్ నెస్ నవల -నవలలో వుహాన్-400 వైరస్ గురించి వివరణ

ప్రపంచవ్యాప్తంగా భయకంపితుల్ని చేస్తున్న కోవిడ్-19 ను పోలిన ప్రమాదకర వైరస్ గురించి 40 ఏళ్ల కిందటే ఓ నవలలో ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ నవల పేరు ద ఐస్ ఆఫ్ డార్క్ నెస్. కాల్పనిక ఇతివృత్తంతో రాసిన ఈ థ్రిల్లర్ నవల 1981లో వచ్చింది. అమెరికాకు చెందిన డీన్ కూంట్జ్ దీని రచయిత. ఆ నవలలో... వుహాన్-400 అనే వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు జీవాయుధంగా రూపొందిస్తారు. శత్రుదేశాలపై యుద్ధాల్లో ఉపయోగించేందుకు ఈ జీవాయుధాన్ని చైనా సిద్ధం చేస్తుంది. ఓ మిలిటరీ ప్రయోగశాలలో ఈ వుహాన్-400 వైరస్‌ను సృష్టిస్తారు. ఇది మనుషులపై విపరీతమైన ప్రభావం చూపుతుందని, దీన్ని ప్రయోగించడం ద్వారా కొన్ని దేశాలను తుడిచిపెట్టవచ్చని ఆ నవలలో పేర్కొన్నారు. తాజాగా ఓ నెటిజన్ ఈ నవలలోని అంశాలను వెలుగులోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు కరోనా వైరస్ మొదలైన ప్రాంతం కూడా వుహాన్ కావడంతో ఈ అంశానికి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories