కిమ్ అనారోగ్య ప్రచారానికి చెక్.. శనివారం ప్రజల ముందుకి..

కిమ్ అనారోగ్య ప్రచారానికి చెక్.. శనివారం ప్రజల ముందుకి..
x
North korea's kim jong un (File photo)
Highlights

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారనే ప్రచారానికి న్యూస్ ఏజెన్సీ కేఎన్సీఏ చెక్ పెట్టింది.

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారనే ప్రచారానికి న్యూస్ ఏజెన్సీ కేఎన్సీఏ చెక్ పెట్టింది. అయితే దీనిపై ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి. ఆ మీడియాలో తెలిపి ప్రకారం..కిమ్ శనివారం ప్రజల ముందుకి వచ్చారనీ రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లోని ఓ నిర్మాణం పూర్తైన ఎరువుల కర్మాగారాన్ని సందర్శించి, అక్కడి వేడుకల్లో పాల్గొన్నారని తెలిపింది.

కిమ్ చివరిసారి ఏప్రిల్ 11న కరోనా వైరస్‌పై జరిగిన అధికార పార్టీ చర్చలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన కనిపించలేదు. ఏప్రిల్ 15న తన తాతగారి జయంతి వేడుకల్లో కూడా పాల్గొనలేదు. అందువల్ల ఆయనకు ఏమైందోనని ప్రపంచం ఆలోచించింది. ఆ తర్వాత ఆయన అడ్రస్ లేకపోవడంతో.. కిమ్ కి సంబంధించిన అంశాలను ఆయన సోదరి నడిపిస్తుండటంతో... ప్రపంచ మీడియా కిమ్ ఉనికిపై అనుమానం వ్యక్తం చేసింది. కిమ్ జోంగ్ ఉన్‌కి తీవ్ర అనారోగ్యం ఏర్పడిందని కథనాలు ఇచ్చింది. వారం రోజుల క్రితం చైనా నుంచి కొందరు వైద్యులు ఉత్తర కొరియా వెళ్లడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

తాజాగా ప్రజలకు కిమ్ కనిపించారని ఉత్తర కొరియా మీడియా చెప్పడంతో.. 20 రోజుల ఊహాగానాలు, ప్రచారానికి తెరపడినట్లైంది. అయిత కిమ్‌తో పాటు కొందరు సీనియర్ అధికారులు, ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కూడా వెళ్లారని వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories