Kim Jong-un: అమెరికాపై నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నిప్పులు

North Korean Leader Kim Jong Un has Strong Warning to United States
x

Kim Jong-un: అమెరికాపై నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నిప్పులు

Highlights

Kim Jong-un: రెచ్చగొడితే అణుదాడి తప్పదని హెచ్చరిక

Kim Jong-un: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అమెరికాపై మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తమను రెచ్చగొడితే అణుదాడులు తప్పవంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. నిన్న ప్యాంగ్యాంగ్‌లో నిర్వహించిన సైన్యం 90వ వార్షికోత్సవంలో కిమ్‌ పాల్గొన్నారు. దేశ అణ్వస్త్ర శక్తిని అత్యంత వేగంగా పెంచుకునే ప్రయత్నాలు తాము చేస్తున్నామని కిమ్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. యుద్ధాన్ని నివారించడడమే అసలు లక్షమన్నారు. అనివార్య పరిస్థితులు ఏర్పాడితే మాత్రం అణ్వాయుధాలను ఉపయోగిస్తామన్నారు. దేశ అణ్వస్త్ర శక్తిని అత్యంత వేగంగా పెంచుకునేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఏ శక్తులైనా తమ దేశ ప్రయోజనాలను దెబ్బ తీయాలని చూసే అమెరికా, దాని మిత్రదేశాలపై అణుబాంబులను ప్రయోగించడానికి వెనుకాడేది లేదని కిమ్‌ తేల్చి చెప్పారు. అణ్వాయుదాలు దేశ శక్తికి గుర్తులన్నారు. అయితే ఆంక్షలు నుంచి మినహాయింపులు పొందడమే లక్ష్యంగా అణు పరీక్షలు చేస్తున్నట్టు కిమ్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందని నిపుణులు అంటున్నారు.

ప్రపంచ దేశాలు తీవ్ర ఆంక్షలు విధించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తరచూ క్షిపణుల ప్రయోగాలతో రెచ్చిపోతున్నారు. ఇటీవల హ్వాసంగ్‌-17 ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఓవైపు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం జరుగుతుంటే కిమ్‌ ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. దేశంలో పేదరికంతో ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోని ఈ ఆధునిక నియంత నిత్యం అణు పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచాన్ని ప్రమాదపుటంచులకు నెట్టేస్తున్నాడు. ఏ మిస్సైల్‌ ప్రయోగించినా దక్సిణ కొరియాకు మద్దతు ఇస్తున్న అమెరికా లక్ష్యంగానే తయారుచేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories