ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చనిపోయాడని రూమర్లు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చనిపోయాడని రూమర్లు
x
kim Jong un
Highlights

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (36) ఆరోగ్యం గురించి వేర్వేరు రూమర్లు వస్తున్నాయి.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (36) ఆరోగ్యం గురించి వేర్వేరు రూమర్లు వస్తున్నాయి. శనివారం రాత్రి, హాంకాంగ్ ఛానల్ తన నివేదికలో కిమ్ మరణాన్ని నివేదించింది. అదే సమయంలో, దక్షిణ కొరియా మీడియా నివేదిక కిమ్ గుండె శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యంగా ఉన్నారని.. ప్రస్తుతం రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని కథనం ప్రసారం చేసింది. మరోవైపు, కిమ్ ఆరోగ్యం గురించి అంతర్జాతీయ మీడియాలో వివిధ రకాలుగా రూమర్లు వస్తున్న తరుణంలో చైనా తన వైద్యుల బృందాన్ని ఉత్తర కొరియాకు పంపింది.

కిమ్ జోంగ్ కొన్ని నెలలుగా గుండె సమస్యతో బాధపడుతున్నాడని, వెర్టిగోకు గురయ్యాడని చైనా వైద్య బృందం సభ్యుడు జపాన్ పత్రికకు తెలిపారు. తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది. గుండెలో స్టెంట్ వేశారని చెప్పారు. అయితే దక్షిణ కొరియా , చైనాలోని అధికారులు మాత్రం కిమ్ కోలుకున్న నివేదికలను ఖండించారు. శస్త్రచికిత్స తర్వాత కిమ్ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.

కొన్ని మీడియా నివేదికలలో.. కిమ్ కు లగ్జరీ బీచ్ రిసార్ట్‌ ఉందని.. అతను తన వ్యక్తిగత రైలు , ఎంపిక చేసుకున్న సిబ్బందితో రిసార్ట్ చేరుకున్నాడని. అతను అక్కడ నడవడం చాలా మంది చూశారని వార్తలు ప్రచురించాయి. మరికొన్ని నివేదికలలో మాత్రం ప్యోంగ్యాంగ్‌లో అతని సన్నిహితులకు కోవిడ్ -19 పాజిటివ్‌ లక్షణాలు ఉన్నాయని దాంతో రాజధాని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడని పేర్కొన్నాయి. అయితే ఇంత జరుగుతున్నా ఉత్తరకొరియా అధికారులు మాత్రం కిమ్ ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories