ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. ఈయన మాత్రం ఇప్పుడు మేల్కొన్నారు..

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. ఈయన మాత్రం ఇప్పుడు మేల్కొన్నారు..
x
Highlights

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే మిసైల్ టెస్ట్ చేస్తూ కాలక్షేపం చేసిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జుంగ్ ఉన్.. తొలిసారి ప్రపంచానికి తెలిసేలా కరోనాపై దృష్టిసారించారు.

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే మిసైల్ టెస్ట్ చేస్తూ కాలక్షేపం చేసిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జుంగ్ ఉన్.. తొలిసారి ప్రపంచానికి తెలిసేలా కరోనాపై దృష్టిసారించారు. కరోనావైరస్ వ్యాప్తిపై కిమ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో దేశంలో కఠినమైన మరియు, సమగ్రమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర కొరియా పిలుపునిచ్చింది.ఆదివారం కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్ఎ) లో వెల్లడైన వివరాల ప్రకారం.. కరోనా వైరస్ ఆర్థిక నిర్మాణంలో దేశ ప్రయత్నాలకు అడ్డంకులను సృష్టించిందని పేర్కొంది.

కొరియా పాలక వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరో సమావేశంలో ప్రధానంగా అధికారులు వైరస్ చొరబాట్లపై కఠినంగా, సమగ్రంగా తనిఖీ చేయాలని పిలుపునిచ్చారు అని తెలిపింది. ఈ తీర్మానంలో 'దేశవ్యాప్తంగా అత్యవసర అంటువ్యాధి నిరోధక సేవలను నిరంతరం తీవ్రతరం చేయడం, బలమైన ఆర్థిక నిర్మాణంతో ముందుకు సాగడం, జాతీయ రక్షణ సామర్థ్యాన్ని పెంచడం, ఈ సంవత్సరం ప్రజల జీవనోపాధిని స్థిరీకరించడం' అనే లక్ష్యాలపై కూడా చర్చించినట్టు పేర్కొంది.

కాగా ఉత్తర కొరియా రాష్ట్ర మీడియా విడుదల చేసిన ఫోటోలు కిమ్ జోంగ్ ఉన్‌తో సహా సమావేశానికి హాజరైన కమిటీ సభ్యులు ఎవరూ మాస్కు ధరించలేదు కదా.. కనీసం ఒకరికొకరు దూరంగా కూడా కూర్చోలేదని తేలింది.

మరోవైపు ఉత్తరకొరియాలో కరోనావైరస్ ప్రభావంపై ఆ దేశం వివరాలు వెల్లడించనప్పటికీ.. ఏప్రిల్ 2 నాటికి 709 మంది కోవిడ్ భారిన పడ్డారని .. ఇందులో 11 మంది విదేశీయులు ఉన్నారని.. 24,800 మందికి పైగా నిర్బంధం నుండి విడుదల చేయబడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories