Nobel Prize: కొవిడ్‌ వ్యాక్సిన్ల తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్తలకు నోబెల్‌

Nobel Prize In Medicine For Two Experts
x

Nobel Prize: కొవిడ్‌ వ్యాక్సిన్ల తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్తలకు నోబెల్‌

Highlights

Nobel Prize: వ్యాక్సిన్ల అభివృద్ధికి తొడ్పడిన కరికో, డూ వెయిర్‌మన్‌ల పరిశోధన

Nobel Prize: వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం 2023 కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌లను వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్‌ బేస్‌ మాడిఫికేషన్లకు సంబంధించిన ఆవిష్కరణలకు ఈ ఇద్దరికి అవార్డును ప్రకటించారు. ఈరోజు స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది.

స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా..1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. గతేడాది మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్‌ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు స్వాంటె పాబో ఈ అవార్డును అందుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories