అది మ‌నుషుల‌కు ప్ర‌మాదం: డ‌బ్ల్యూహెచ్‌వో

అది మ‌నుషుల‌కు ప్ర‌మాదం: డ‌బ్ల్యూహెచ్‌వో
x
Highlights

క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డిలో భాగంగా వీధుల్లో స్ప్రే చేసే డిస్ఇన్‌ఫెక్టంట్( క్రిమిసంహార‌క)‌ల వ‌ల్ల కరోనా పోదని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (who) వెల్ల‌డించింది.

క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డిలో భాగంగా వీధుల్లో స్ప్రే చేసే డిస్ఇన్‌ఫెక్టంట్( క్రిమిసంహార‌క)‌ల వ‌ల్ల కరోనా పోదని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (who) వెల్ల‌డించింది. ఇది అధికమైతే ప్రమాదమే అని హెచ్చరించింది. ఇది కాలుష్యంపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. శ‌నివారం డ‌బ్ల్యూహెచ్‌వో ఒక ప్ర‌క‌ట‌న‌లో.. వీధులు, మార్కెట్ స్థ‌లాలు, ఇత‌ర బ‌హిరంగ ప్ర‌దేశాల్లో క్రిమిసంహార‌క మందులు చ‌ల్ల‌డం వలన అది ధూళి క‌ణాల్లోకి వెళుతోందని. త‌ద్వారా అది క‌రోనానే కాదు, ఇత‌ర క్రిముల‌పై కూడా ప్రభావం చూపదని చెప్పింది. క్రిమిసంహారక మందులు చల్లడం ఎట్టి పరిస్థితుల్లోనూ సిఫారసు చేయబడదు అని పేర్కొంది.

మ‌నుషుల‌పై క్లోరిన్ వంటి ర‌సాయ‌నాల‌ను నేరుగా ప్ర‌యోగిస్తున్నార‌ని దీనివ‌ల్ల వైర‌స్ వ్యాప్తి తగ్గుతుందని అనుకోవడం భ్రమయే అని అభిప్రాయపడింది. పైగా దీనివ‌ల్ల శారీర‌క‌, మాన‌సిక స‌మ‌స్య‌లు తలెత్తుతాయ‌ని హెచ్చ‌రించింది. ఇక ఈ క్రిమిసంహారక మందులు వాడాలంటే ముందుగా నానబెట్టిన వస్త్రంతో తుడవడం చేయాలి అని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories