షేక్‌హ్యాండా? బాబోయ్ వద్దు.. జర్మనీ ఛాన్స్‌లర్‌కి కరోనా ఎఫెక్ట్


కరోనా భూతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు మూడు వేల మంది మరణించారు.
కరోనా భూతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు మూడు వేల మంది మరణించారు. చైనా పుట్టిన ఈ వైరస్ అన్ని దేశాలను చూట్టేసింది. దీంతో ఎబ్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కరోనా ధాటికి కరచాలనం చేయాలంటే భయపడుతున్నారు. అయితే ఈ జర్మనీలో కరోనా వైరస్ సంబంధించి ఇప్పటి వరకూ 157 కేసులు నమోదయ్యాయి. జర్మనీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఆ దేశ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ కరోనా షాక్ తగిలింది. పూర్తి వివరాల్లో వెళ్లే..
జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఓ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఆ దేశ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ హాజరయ్యారు, ఏంజెలా సమావేశానికి వస్తూ.. అంతర్గత వ్యవహారాల మంత్రి హోర్స్ట్ సీహోఫర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఆయన మాత్రం షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి తన చేతిని ఇవ్వకుండా పలుకరిస్తూ ఓ నవ్వు నవ్వారు. వెంటనే అర్థం చేసుకున్న ఏంజెలా మెర్కెల్ నవ్వూతూ తన చైర్ వద్దకు వెళ్లి కూర్చు్న్నారు.
ఈ సంఘటన చూసిన వారంతా విషయం అర్థం కావటంతో నవ్వుకున్నారు. ఈ నేపథ్యంలో ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, వ్యవహారాల మంత్రి హోర్స్ట్ సీహోఫర్ చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఇతరులకు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తొన్న సంగతి తెలిసిందే.
Angela merkel's interior minister refuses to shake her hand bc of coronavirus 😂 pic.twitter.com/5pSAQGDBXV
— Pardes Seleh (@PardesSeleh) March 2, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



