క్వాడన్ బేల్స్‌కు 2.1 కోట్ల రూపాయల విరాళాలు

క్వాడన్ బేల్స్‌కు 2.1 కోట్ల రూపాయల విరాళాలు
x
Highlights

స్కూల్లో ఏడిపించారని తొమ్మిదేళ్ల ఆస్ట్రేలియా బాలుడు బాధపడుతున్న వీడియో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆ చిన్నారికి అండగా నిలుస్తున్నారు.

స్కూల్లో ఏడిపించారని తొమ్మిదేళ్ల ఆస్ట్రేలియా బాలుడు బాధపడుతున్న వీడియో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆ చిన్నారికి అండగా నిలుస్తున్నారు. పొట్టిగా ఉన్నాడని స్కూల్లో ఆటపట్టించడంతో ఏడుస్తున్న కొడుకు క్వాడన్ వీడియో క్లిప్‌ను అతడి తల్లి యర్రక బేల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరు నిమిషాల ఈ వీడియోను ఫిబ్రవరి 25న పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు కోటీ 50 లక్షల మందికి పైగా చూశారు.

ఓ చిన్నారి తన ఏడుపుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తనతోటి విద్యార్థులు పొట్టిగా ఉన్నావని ఆ చిన్నారిని నిత్యం ఏడిపించేవారు. దీంతో ఆ బాలుడు స్కూల్ కు వెళ్లనని మారం చేసేవాడు. పిల్లాడి పరిస్థితిని అర్థం చేసుకున్న బాలుడి తల్లి తానే స్వయంగా స్కూల్‌కి తీసుకెళ్లింది. రోజులాగే తోటి విద్యార్థులు ఆ బాలుడిని ఆటపట్టించడంతో ఏడవసాగాడు. ఈ తంతంగాన్ని అక్కడే ఉన్న బాలుడి తల్లి యర్రక బేల్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

క్వీన్‌లాండ్‌లో ఉన్న క్వాడన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అండగా నిలుస్తున్నారు. పొట్టిగా ఉన్నాడని స్కూల్లో ఆటపట్టించడంతో ఏడుస్తున్న కొడుకు క్వాడన్ వీడియో క్లిప్‌ను అతడి తల్లి యర్రక బేల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏడిపించడం వల్ల ఇలాగే జరుగుతుందని ఆమె ఆ వీడియోలో చెప్పారు. ఆ వీడియోలో ఆమె కొడుకు నాకు చచ్చిపోవాలని అనిపించింది అని కూడా చెబుతాడు.

"#We Stand With Quaden" అనే హ్యాష్‌టాగ్‌తో ఎంతోమంది అతడికి సందేశాలు పంపుతూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. హాలీవుడ్ నటుడు హ్యూ జాక్‌మన్, బాస్కెట్ బాల్ ఆటగాడు ఎనెస్ కాంటెర్ దీనిపై మాట్లాడారు. ఇతర దేశాల్లో ఉన్న చాలామంది తల్లిదండ్రులు కూడా అతడికి ధైర్యం చెబుతూ తమ పిల్లలతో వీడియో సందేశాలు చేయించి షేర్ చేస్తున్నారు. నువ్వు నీకు తెలిసిన దానికంటే బలవంతుడివని హ్యూ జాక్‌మాన్ ట్వీట్ చేశాడు.

ఈ వీడియో వైరల్ అవడంతో చాలామంది తమ సొంత అనుభవాలను చెబుతూ క్వాడన్‌కు ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. వివిధ దేశాల్లో ఉన్న పిల్లలు కూడా క్వాడన్‌కు స్నేహ సందేశాలు పంపిస్తున్నారు. మరుగుజ్జు తనంతో ఇలాంటి వేధింపులే భరించిన అమెరికా హాస్యనటుడు బ్రాడ్ విలియమ్స్.. క్వాడన్ కుటుంబాన్ని డిస్నీలాండ్ పంపించేందుకు ఒక్క రోజులో 93 లక్షలకు పైనే సేకరించానని చెప్పాడు.ఆయన ఇది క్వాడన్‌కే కాదు, తమ జీవితంలో వేధింపులు ఎదుర్కొని, తమ దగ్గర తగిన స్థోమత లేదని బాధపడే ఎవరికైనా అందుతుంది. ప్రపంచంలో మంచి కూడా ఉందని క్వాడన్‌కు, మిగతా వారికి చూపిద్దాం అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కొడుకు ఎరిక్ ట్రంప్ ఈ వీడియో తన గుండె పిండేసిందని చెప్పాడు. బాస్కెట్ బాల్ ఆటగాడు ఎనస్ కాంటెర్ ప్రపంచమంతా నీ వెనక ఉందని చెప్పాడు. క్వాడన్ కుటుంబాన్ని తన ఎన్‌బీఏ గేమ్‌కు ఆహ్వానించాడు. ఆస్ట్రేలియా క్రీడా జట్లు కూడా క్వాడన్ వెంట నిలిచాయి. దేశీయ రగ్బీ లీగ్ ఈ వారాంతంలో జరిగే ఒక మ్యాచ్‌లో తమ జట్టు ముందు లీడ్ చేయాలని బాలుడిని ఆహ్వానించాయి.

ఈ వీడియో వైరల్ కావడంతో అమెరికాకు చెందిన కమెడియన్ బ్రాడ్ విలియమ్స్ గో ఫండ్ మిలో ఒక పేజీని ప్రారంభించి క్వాడన్ బేల్స్ కోసం విరాళాల సేకరణ ప్రారంభించారు. క్వాడన్‌ను డిస్నీలాండ్ పంపించేందుకు సుమారు రూ.71 లక్షలు లక్ష్యంగా ఈ పేజీని ప్రారంభించగా.. అనుకున్న దానికంటే 30 రెట్లు ఎక్కువగా విరాళాలు వచ్చిపడ్డాయి. సుమారు 2.1 కోట్లు విరాళాలు సమకూరాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories