Nina Kutina Case: గుహలో పిల్లలతో రష్యన్ మహిళ… తెరపైకి వచ్చిన పిల్లల తండ్రి!

Nina Kutina Case: గుహలో పిల్లలతో రష్యన్ మహిళ… తెరపైకి వచ్చిన పిల్లల తండ్రి!
x

Nina Kutina Case: గుహలో పిల్లలతో రష్యన్ మహిళ… తెరపైకి వచ్చిన పిల్లల తండ్రి!

Highlights

కర్ణాటకలో గుహలో ఇద్దరు చిన్నారులతో కలిసి నివసించిన రష్యన్ మహిళ నినా కుటినా కథ మరో మలుపు తిరిగింది.

కర్ణాటకలో గుహలో ఇద్దరు చిన్నారులతో కలిసి నివసించిన రష్యన్ మహిళ నినా కుటినా కథ మరో మలుపు తిరిగింది. ఆ పిల్లలకు తండ్రిని తానేనని ఇజ్రాయెల్‌కు చెందిన ద్రోర్ గోల్డ్‌స్టెయిన్ తెరపైకి వచ్చాడు. “నేను కేవలం తండ్రిగా ఉండాలనుకుంటున్నాను, నా పిల్లలను కలవాలని ఉంది” అని గోల్డ్‌స్టెయిన్ పేర్కొన్నాడు. తనకు చెప్పకుండానే నినా గోవా నుంచి వెళ్లిపోయిందని కూడా వెల్లడించాడు.

గుహలో నినా జీవితం

నినా కుటినా ఒక యాత్రికురాలు, కళాకారిణి. గుహలో జీవితం తనకు ప్రశాంతంగా, స్వతంత్రంగా అనిపించిందని ఆమె చెప్పింది. మీడియా తన జీవితాన్ని తప్పుగా చూపిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను బిజినెస్ వీసాపై భారతదేశానికి వచ్చానని, 15 ఏళ్లుగా అనేక దేశాలు తిరిగానని తెలిపారు. తన నలుగురు పిల్లలను ఆసుపత్రి సహాయం లేకుండానే జన్మనిచ్చానని, వారికి ఇంట్లోనే చదువు చెబుతున్నానని నినా పేర్కొన్నారు. కళా పనులు, బోధన ద్వారా డబ్బు సంపాదిస్తున్నానని కూడా తెలిపారు.

నినా ఆరోపణలు, రష్యా సాయం

గుహ నుంచి బయటకు తీసుకువచ్చిన తర్వాత, తమను అపరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచారని నినా ఆరోపించారు. ఆహారం కూడా సరిగ్గా అందించలేదని, తన చనిపోయిన కొడుకు అస్తికలు, వ్యక్తిగత వస్తువులు తీసుకున్నారని వాపోయారు. వ్యక్తిగత సమస్యలు, చట్టపరమైన ఇబ్బందుల కారణంగా రష్యాకు వెళ్లలేకపోతున్నానని చెప్పారు. అయితే భారతదేశం తనకు చాలా ఇష్టమని తెలిపారు. ప్రస్తుతం రష్యా రాయబార కార్యాలయం నినాకు, ఆమె పిల్లలకు సహాయం అందిస్తోంది.

పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం

ద్రోర్ గోల్డ్‌స్టెయిన్ తండ్రిగా ముందుకు రావడంతో పిల్లల సంరక్షణపై చర్చ మొదలైంది. నినా కుటినా, ద్రోర్ గోల్డ్‌స్టెయిన్‌ల మధ్య పిల్లల సంరక్షణ ఎవరికి అప్పగించాలనే అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories