పశ్చిమాసియాలో ఎయిర్‌పోర్టుల మూసివేత: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రభావం – వేలాది ప్రయాణికులు చిక్కులు

🛑 పశ్చిమాసియాలో ఎయిర్‌పోర్టుల మూసివేత: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రభావం – వేలాది ప్రయాణికులు చిక్కులు
x

🛑 పశ్చిమాసియాలో ఎయిర్‌పోర్టుల మూసివేత: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రభావం – వేలాది ప్రయాణికులు చిక్కులు

Highlights

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రతతో పశ్చిమాసియా వ్యాప్తంగా విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి. 10వేలకు పైగా ప్రయాణికులు చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం భారతీయుల తరలింపుకు చర్యలు చేపట్టింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, ఈ ప్రాంతంలోని పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దాంతో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో, వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. విమానయాన రంగంలో భారీ ఆటంకం ఏర్పడింది.

ఇరాన్ ప్రధానమైన ఖొమేనీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు సహా, టెహ్రాన్‌ మెహ్రాబాద్‌ విమానాశ్రయాన్ని మూసివేయడం, అలాగే ఇజ్రాయెల్ బెన్ గురియన్ ఎయిర్‌పోర్టును కూడా తాత్కాలికంగా మూసివేయడం గమనార్హం. జాన్ కాక్స్ అనే రిటైర్డ్ పైలట్, విమానయాన భద్రతా నిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం, 10వేలకు పైగా ప్రయాణికులు పశ్చిమాసియా ప్రాంతంలో చిక్కుకుపోయారు.

లెబనాన్, జోర్డాన్, ఇరాక్ దేశాల గగనతలాలు మూసివేయబడ్డాయి లేదా పరిమితమైన విధానంలో మాత్రమే పనిచేస్తున్నాయి. లెబనాన్, జోర్డాన్‌లో గగనతలం పాక్షికంగా తెరిచి ఉన్నప్పటికీ, విమాన రద్దులు, ఆలస్యాలు, అప్రమత్తతతో గందరగోళ వాతావరణం నెలకొంది.

భారతీయుల తరలింపు ప్రారంభం:

ఇరాన్‌లో సుమారు 10,000 మంది భారతీయులు, అందులో 6,000 మంది విద్యార్థులు ఉండగా, భారత ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్‌లో 100 మంది భారతీయులను టెహ్రాన్‌ నుంచి తరలించారు. గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భూసరిహద్దుల ద్వారా భారత్‌ తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు ఆర్మేనియా, అజర్‌బైజాన్, తుర్కమెనిస్తాన్, అఫ్గానిస్థాన్ మార్గాలు వాడనున్నట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కూడా జోర్డాన్, ఈజిప్ట్ సరిహద్దుల గుండా ప్రజలు ప్రయాణించవద్దని హెచ్చరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories