logo

పెళ్లయిన 3 నిమిషాలకే విడాకులు

పెళ్లయిన 3 నిమిషాలకే విడాకులు

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కానీ కువైట్‌లో ఓ జంటకు మాత్రం పెళ్లంటే మూడే నిముషాలు అన్నంతలా గడిచిపోయింది. మూడే నిముషాలు ఏంటి అని ఆశ్చర్యపోకండి.. కువైట్‌లో ఓ జంట పెళ్ళైన మూడు నిమిషాలకే ఈ పెళ్లి మాకొద్దు బాబోయ్‌ అంటూ విడాకులు తీసుకుంది. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా విడాకులు తీసుకున్న జంట కూడా ఇదే కావచ్చని ఆ దేశ మీడియా అభిప్రాయపడింది. కువైట్‌లో గత నెలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత నెలలో ఆ జంట వివాహం చేసుకుంది. అయితే తమ పెళ్లికి సంబంధించి రిజిస్ట్రేషన్‌పై జడ్జి ఎదుట సంతకాలు పెట్టారు. అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో పెళ్లికూతురు పొరపాటున కింద పడింది. పక్కనే ఉన్న వరుడు ఆ అమ్మాయికి సహాయం చేయాల్సింది పోయి.. కింద పడినందుకు పరుష పదజాలంతో దూషించాడు. అంతే కోపోద్రిక్తుడైన వధువు జడ్జి దగ్గరకు వెళ్లి విడాకులు కావాలని అడగటం.. దానికి వధువు కూడా ఒకే చెప్పడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. దాంతో మూడు నిమిషాల్లోనే వీరి పెళ్లి పెటాకులైంది. కువైట్‌ చరిత్రలోనే ఇంత తక్కువ వ్యవధిలో విడాకులు తీసుకున్న జంటగా వీరు గుర్తింపు పొందారని స్థానిక మీడియా పేర్కొంది.

లైవ్ టీవి

Share it
Top