Air Pollution: న్యూయార్క్ లో ప్రమాదకర స్థితిలో వాయు కాలుష్యం

New York Struggling With Air Pollution
x

Air Pollution: న్యూయార్క్ లో ప్రమాదకర స్థితిలో వాయు కాలుష్యం

Highlights

Air Pollution: పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన బెైడెన్

Air Pollution: కెనడా కార్చిచ్చు కారణంగా దాదాపు 500 చోట్ల అడవులు అంటుకున్నాయి. అయితే ప్రతీసారి అమెరికాలో కార్చిచ్చు పశ్చిమ ప్రాంతాలకే పరిమితమయ్యేది. కానీ ఈ సారిమాత్రం తూర్పు ప్రాంతాలైన నోవా స్కాటియా, క్యూబెక్, అంటారియోలాకు విస్తరించడంతో కెనడా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏప్రిల్‌లో బ్రిటీష్ కొలంబియా, అల్బర్టాలో మొదలైన కార్చిచ్చు కారణంగా అధికారులు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కెనడా అడవుల్లోని మంటలు పొగ , గాలిలో ప్రయాణించి పక్కనే ఉన్న అమెరికాలోని పలు రాష్ట్రాలను కమ్ముకుంటోంది. అయితే మానవ తప్పిదాలతో వాతావరణ మార్పుల కారణంగానే కార్చిచ్చు విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.దీన్ని నివారించడానికి కెనడా ఇతర దేశాలతో సాయాన్ని కోరుతోంది.

అమెరికాలోని న్యూయార్క్ , న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, కొలంబియాతో పాటు పలు చోట్ల దట్టమైన పొగలు ఆవరించాయి. అమెరికా లో స్కూళ్లను మూసివేసారు.పొగ కారణంగా గాలిలో వాయు కాలుష్యం పెరిగిపోయింది.కాలుష్యం 500 ఏక్యూఐల అత్యధిక స్థాయికి చేరుకుంది. ఏక్యూఐ 300 దాటితేనే ప్రమాకరగా భావిస్తారు. అందుకే అమెరికా వాతావరణ శాఖ అనేక రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ప్రజలంతా మాస్కులు ధరించాలని , అప్రయత్తంగా ఉండాలని బెైడెన్ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories