ఏవండోయ్..ఇది విన్నారా? అక్కడ సమాధుల వద్ద కొత్తసంవత్సరం వేడుకలు జరుపుకుంటారట!

ఏవండోయ్..ఇది విన్నారా? అక్కడ సమాధుల వద్ద కొత్తసంవత్సరం వేడుకలు జరుపుకుంటారట!
x
Highlights

గడిచిన ఈ కాలాన్ని చరిత్రల్లో కలుపుతూ.. అందరి మదితో ఉత్సాహాన్ని నింపుతూ..

గడిచిన ఈ కాలాన్ని చరిత్రల్లో కలుపుతూ.. అందరి మదితో ఉత్సాహాన్ని నింపుతూ.. కొత్త పుంతలు తొక్కుతూ వస్తున్న నూతన సంవత్సరానికి ఆహ్వాన్ని పలికేందుకు ప్రంచమంతా ఎదురు చూస్తుంది. సరి కొత్త ఆశలతో, సరికొత్త ఆశయాలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ వేడుకను జరుపుకుంటారు. నూతన సంవత్సరాన్ని ఒక్కో దేశంలో ఒక్కోలా ఆహ్వానం పలుకుతుంటాయి. ఈ వేడుకలను వివిధ రకాలుగా జరుపుకుంటాయి. ఏ దేశం సంప్రదాయలు ఏవిధంగా జరుపుకుంటాయో చూద్దాం.. కొత్త సంవత్సర వేడుకలు ఈక్వెడార్‌, గ్రీస్‌ అమెరికా, యూరప్‌, ఆసియా దేశాల్లో వేరువేరుగా సెలబ్రేట్‌ చేసుకున్నా అందరి ఆలోచన కొత్త దేశానికి ఆహ్వానం పలకడమే..

న్యూజిలాండ్:

నూతన సంవత్సర వేడుకలు అంటే ముందకుగా గుర్తుకువచ్చే దేశం న్యూజిలాండ్. కొత్త సంవత్సరాన్ని ముందుగా ఆహ్వానించే తొలి దేశం న్యూజిలాండ్. న్యూజిలాండ్ రాజధాని ఇంటర్నేషనల్‌ డేట్‌లైన్‌కు బాణాసంచాతో ఓ ప్రత్యేకత ఆహ్వానం ఉంది. న్యూజిలాండ్‌తో ప్రతేకత ఉంది.


ఆఫ్రికా:

న్యూ ఇయర్‌ వేడుకలను ఆఫ్రికాలోని పలు దేశాలు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ముందుగా ఇక్కడి ప్రజలు చర్చ్‌ గంటలు మోగించడం ద్వారా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. మ్యూజిక్‌, లావిష్‌ డిన్నర్‌, డాన్స్‌లతో యువత ఉత్సాహంగా సెలబ్రిట్ చేసుకుంటారు. ఇక దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లోని ఆల్ఫ్రెడ్గ వాటర్‌ ఫ్రంట్‌‌ల వద్ద జరిగే ఉత్సవాలు ఆ దేశంలో ఎంతో పాపులర్ కూడా‌. నూతన సంవత్సరం సందర్భంగా కేప్‌టౌన్‌ మినిస్ట్రెల్‌ కార్నివాల్‌ పేరుతో ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతారు.


జపాన్‌:

జపాన్‌లో నూతన సంవత్సరం అంటే అర్ధరాత్రి సమయంలో గంటలు మోగిస్తారు. రాత్రి 12 కాగానే 108 సార్లు ఈ గంటలు మోగుతాయి. అలా చేస్తేనే తమ భవిష‌్యత్ బాగుంటుందని భావిస్తారు.

ఇటలీ:

కొత్త సంవత్సరం కాస్త వినూత్న రీతిలో జరుపుకుంటారు. పాడుపడ్డ చెత్త సామాన్లను వదిలించుకోవడానికి ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేస్తారు. అలా బయటపడేయడ మంటే మనసుల్లో మనస్సుల్లో ఉన్న చెడు ఆలోచనలను తొలిగించుకోవడం అంటారు.

స్పెయిన్‌:

స్పెయిన్‌లో డిసెంబర్‌ 31 అర్ధరాత్రి 12 గంటల సమయానికి ఆ దేశప్రజలు 12 ద్రాక్షపళ్లు తింటారు. అలా ద్రాక్షలు తింటే అదృష్టం కలిసొస్తుందని స్పెయిన్ ప్రజల నమ్మకం.


గ్రీస్‌:

ఇక గ్రీస్‌లో ఉల్లిపాయలు పంచుతారు జనవరి 1న చర్చికి వెళ్లి అక్కడ వారికి ఉల్లిపాయలు ఇస్తారు. ఉల్లిని తీసుకెళ్లి దండలా తయారు చేస్తారు. ఇంటి గుమ్మానికి వేళ్లాడతీస్తారు. ఉల్లిపాయలు అంటే ఆరోగ్యం ఆయూషు పెంచడానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే నూతన సంవత్సరం గ్రీస్‌లో ఉల్లిపాయల దండ గుమ్మానికి కడతారు.

చిలీ:

కొత్త సంవత్సరం ఉత్సవాల్ని వివిధ దేశాల ఒక్కో తీరుగా జరుపుకుంటే.. ప్రజలు వినూత్నంగా జరుపుతారు. తమ ఆప్తుల సమాధుల వద్ద ఈ సంబరాలు జరుపుకుంటారు. ప్రియమైన వారి సమాధుల్ని పూలతో అలంకరించి, దీపాలు ఉంచుతారు. చిలీ 1995 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ లోకంలోని వారి తలచుకుంటే అంతా మంచి జరుగుతుందని భావిస్తారు.



డెన్మార్క్‌:

డెన్మార్క్‌లో రకరకాల పింగాణి పాత్రలు బద్దలు కొడతారు. డిసెంబర్ 31 రాత్రి ప్లేట్లు, కప్పులు, స్పూన్‌లు లాంటివన్నీ విరగ్గొట్టేస్తారు. అప్పుడే అదృష్టం తమని వరిస్తుందని డెన్మార్క్ ప్రజల గట్టి నమ్మకం.

చెక్‌ రిపబ్లిక్‌:

చెక్ రిపబ్లిక్ లో నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా యాపిల్‌ కట్‌ చేస్తారు. యాపిల్‌ను మధ్యకి కోసి విత్తనాలు ఉన్న చోట స్టార్‌ వస్తే కొత్త ఏడాదంతా మంచే జరుగుతుందని వారి నమ్మకం. అదే క్రాస్‌ వస్తే చెడు జరిగే అవకాశం ఉందని వారి నమ్మకం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories