కరోనా ఎఫెక్ట్ : ఆ ఒక్క దేశం మినహ.. న్యూయర్ వేడుకలకు దూరంగా ప్రపంచ దేశాలు..

కరోనా ఎఫెక్ట్ : ఆ ఒక్క దేశం మినహ.. న్యూయర్ వేడుకలకు దూరంగా ప్రపంచ దేశాలు..
x
Highlights

కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రపంచ దేశాలన్ని ఎంతో ఉత్సాహంతో స్వాగతం పలుకుతాయి.

కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రపంచ దేశాలన్ని ఎంతో ఉత్సాహంతో స్వాగతం పలుకుతాయి. బాణసంచా, కేరింతలు, నృత్యాలతో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు పోటీపడతాయి. కానీ, ఈ సారి కరోనా మహమ్మారి కారణంగా కొత్త ఏడాది ఉత్సవాలకు అన్ని దేశాలు దూరంగా ఉండనున్నాయి. ఆయా దేశాల్లో ప్రభుత్వాల ఆంక్షల నడుమ నిరాడంబరంగానే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వివిధ దేశాల ప్రజలు సిద్ధమయ్యారు.

కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే దేశాల్లో న్యూజిలాండ్‌ ముందుంటుంది. అయితే ఇక్కడ కరోనా వైరస్‌ తీవ్రత కాస్త అదుపులోనే ఉందనే చెప్పవచ్చు. అయినప్పటికీ ముందు నూతన సంవత్సర వేడుకలను రద్దు చేశారు. ఆసియా, యూరప్‌, అమెరికా దేశాల్లోనూ నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

తైవాన్‌ నూతన సంవత్సర వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమైంది. కరోనా వైరస్‌ మహమ్మారిని జయించిన అతికొద్ది దేశాల్లో తైవాన్‌ ముందుందనే చెప్పవచ్చు. ఇప్పటివరకు 700పాజిటివ్‌ కేసులు మాత్రమే బయటపడగా, వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ సారి ఫైర్‌వర్స్క్‌ను యథావిథిగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆస్ట్రేలియా కూడా నూతన సంవంత్సర వేడుకులకు ముందుంటుంది. ఏటా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసే అతిపెద్ద ఫైర్‌వర్క్స్‌ కార్యక్రమంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారని అంచనా. అలాంటి భారీ వేడుకలను వీక్షించడానికి యావత్‌ ప్రపంచం నుంచి పర్యటకులు ఆసక్తి చూపిస్తారంటే అతిశయోక్తి కాదు. కానీ, ఈసారి మాత్రం కరోనా ప్రభావంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న మెల్‌బోర్న్‌లోనూ నూతన సంవత్సర ఫైర్‌వర్క్స్‌ కార్యక్రమాలను రద్దు చేశారు.

దక్షిణ కొరియాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్నందున 1953 తర్వాత తొలిసారి 'బెల్‌ రింగింగ్‌' కార్యక్రమాన్ని రద్దుచేశారు. కొత్త సంవత్సర వేడుకలను అక్కడి ప్రభుత్వం రద్దుచేసింది. జపాన్‌లోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అక్కడ డిసెంబర్‌ 31 రాత్రి ఆంక్షలు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్‌కు కారణమైన చైనాలోనూ ఈ సారి కొత్త సంవత్సరం వేడుకలు నిరాడంబరంగానే జరగనున్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories