ఫేస్‌బుక్‌లో అదిరిపోయే ఫీచర్..అదేంటో తెలుసా..

ఫేస్‌బుక్‌లో అదిరిపోయే ఫీచర్..అదేంటో తెలుసా..
x
Highlights

ఫేస్ బుక్ యాప్‌ను పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సందేశాలు పంపించాలన్నా ఒక సమాచారన్ని అందరితో షేర్ చేసుకోవాలనుకున్నా ఫేస్ బుక్ ను యూస్ చేస్తారు.

ఫేస్ బుక్ యాప్‌ను పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సందేశాలు పంపించాలన్నా ఒక సమాచారన్ని అందరితో షేర్ చేసుకోవాలనుకున్నా ఫేస్ బుక్ ను యూస్ చేస్తారు.ఈ యాప్ ను ఒకరో ఇద్దరో వాడడం కాదు ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను వాడుతున్నారు.

ఈ యాప్ కి రోజులు గడిచిన కొలది క్రేజ్ మరింతగా పెరిగిపోతుంది. ఒక్క సారి ఈ యాప్ ను వాడడం మొదలు పెడితే చాలు బయటికి రావడం చాలా కష్టం ఏదో ఒకటి చూస్తూ గంటల తరబడి ఫేస్ బుక్ ను వాడుతూనే ఉంటారు.

అయితే ఫేస్ బుక్ ను అధికంగా వాడ‌డం వ‌లన ఎక్కువ స‌మ‌యం వృథా అవుతుంద‌ని చాలా మంది బాధపడుతూ ఉంటారు. వారికి తెలియకుండానే వారు ఫేస్ బుక్ కు అడెక్ట్ అవుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి వారి కోసం ఫేస్‌బుక్ ఓ సరికొత్త ఫీచ‌ర్‌ను రూపొందించింది యూజర్స్ కి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ ఫీచర్ ని ఒక్క సారి యాక్టివేట్ చేసుకుని టైం సెట్ చేసుకుంటే చాలు ఫేస్ బుక్ ఓపెన్ చేద్దామనుకున్నా అది ఓపెన్ అవదు.

అదే క్వైట్ మోడ్ ఫీచర్. దీంతో ఫేస్ బుక్లో యూజర్స్ గడిపే కాలాన్నినియంత్రించొచ్చు. ఇదేదో బాగుందే అనుకుంటున్నారా. అయితే ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఎక్కువగా ఫేస్ బుక్లో గడిపేవారు ఓ గంటపాటు చూడకూడదని అనుకుంటే క్వైట్ మోడ్ ని ఆన్ చేసి టైమ్ సెట్ చేసుకుంటే చాలు ఆ టైం గడిచే వరకు ఫేస్ బుక్ ను ఓపెన్ చేయలేరు. అంతే కాదు ఫేస్ బుక్ నుంచి వచ్చే ఎలాంటి నోటిఫికేషన్ ను మీరు చూడలేరు.

అలవాటులో పొరపాటుగా ఫేస్ బుక్ ఓపెన్ చేసినా క్వైట్ మోడ్ హెచ్చరిస్తుంది. బాగుంది కదూ ఈ ఫీచర్ కానీ ఇది అన్ని ఫోన్ లలో ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఇది కేవలం ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే అమలులో ఉంది. మరికొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఇది అందుబాటులోకి రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories