రాక్షస బల్లి.. పక్కా వెజిటేరియన్

రాక్షస బల్లి.. పక్కా వెజిటేరియన్
x
Highlights

రాక్షస బల్లి.. అమ్మో ఈ పేరు వింటే చాలు గుండె గుభేల్‌మంటుంది. డైనోసార్లు ఇతర ప్రాణులను చంపేసి.. అమాంతం తినేయటం మనం హాలీవుడ్ మూవీలో చూస్తూనే ఉంటాం. ...

రాక్షస బల్లి.. అమ్మో ఈ పేరు వింటే చాలు గుండె గుభేల్‌మంటుంది. డైనోసార్లు ఇతర ప్రాణులను చంపేసి.. అమాంతం తినేయటం మనం హాలీవుడ్ మూవీలో చూస్తూనే ఉంటాం. కానీ ఆర్నిథోపాడ్ డైనోసార్ల గ్రూపునకు చెందిన ఓ రాక్షస బల్లి మాత్రం పక్కా వెజిటేరియన్. ఇది మాంసం అసలు ముట్టదట.

ఆస్ట్రేలియాలోని ఓ గనిలో జరిపిన తవ్వకాల్లో డైనోసార్ల శిలాజాలు బయటపడ్డాయి. దొరికిన దవడ ఎముక ఆధారంగా ఇదో కొత్త డైనోసారని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 100 మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి భూమిపై సంచరిస్తుండేవట. సాధారణ డైనోసార్లతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటాయి. ఇవి శునకం కంటే కొంచెం ఎక్కువ ఎత్తు ఉంటాయి. రెండుకాళ్లపై నడిచే ఈ రాక్షస బల్లులు.. ఆకులు, అలములు తిని జీవించేవట.

Show Full Article
Print Article
Next Story
More Stories