అమెరికాలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం

అమెరికాలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం
x
Highlights

* ఎక్కడకీ వెళ్లని వ్యక్తులు పాజిటివ్‌గా నిర్దారణ * బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు * కరోనాను అడ్డుకుంటామన్న గవర్నర్

ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన కరోనా నుంచి ఇంకా పూర్తిగా తెరుకోకముందే మరో వైరస్ ప్రజలను కలవరపెడుతోంది. బ్రిటన్‌లో బయటపడిన ఈ వైరస్ మెల్లగా సరిహద్దులు, దేశాలు దాటుతోంది. ఇప్పుడు అమెరికాలోనూ కాలు మోపింది. దేశం దాటి బయటకు వెళ్లని వ్యక్తుల్లోనూ స్ట్రెయిన్ లక్షణాలు బయటపడుతున్నాయి. దాంతో ఎంత మందిలో ఈ వైరస్ ఉందో గుర్తించడం కష్టంగా మారింది. దేశాల అధినేతలు అప్రమత్తం అయ్యారు.

ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో అడుగు పెట్టిన ఈ వైరస్ అగ్రదేశం అమెరికాలో కూడా అడుగు మోపింది. గత కొంతకాలంగా ఎక్కడికీ ప్రయాణించని ఒక యువకుడిలో స్ట్రెయిన్ కరోనా బయటపడింది. దాంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. డెన్వర్ కు చెందిన 20 ఏళ్ల యువకుడిలో ఈ కొత్త వైరస్ లక్షణాలు వెలుగు చూసినట్టు కొలరాడో గవర్నర్ జేర్డ్ పోలీస్ తెలిపారు. దాంతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. ప్రభుత్వం మాత్రం అందరు అప్రమత్తంగా ఉండాలని కోరింది. యువకుడిలో కొత్త వైరస్ బయట పడడంతో అతడి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించేందుకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ రంగంలోకి దిగింది.

మాములు కరోనా కంటే రూపాంతరం చెందిన స్ట్రెయిన్ కరోనా వేగంగా వ్యాపిస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్ పట్ల అమెరికా అప్రమత్తం అయింది. ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేశారు. ప్రయాణికులపైన ఆంక్షలు విధించారు. ఒక వేళ వచ్చినా ప్రయాణికులు తమకు కోవిడ్ సోకలేదని నిర్ధారించే ధ్రువపత్రాన్ని చూపించాలని నిబంధన విధించారు అంతేకాదు నెల రోజులుగా వచ్చే వారి లిస్ట్‌ను వారి కాంటాక్ట్ లిస్ట్‌ను కనుగొనే పనిలో ఉన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories